గ్యాంగ్ లీడర్ నుంచి ఫస్ట్ సాంగ్...

guyyala Navya
న్యాచురల్ స్టార్ నాని కథనాయకుడిగా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్ లీడర్. నాని నటించిన సూపర్ హిట్ చిత్రం జెర్సీ తర్వాత వెంటనే గ్యాంగ్ లీడర్ సినిమా అప్డేట్ వెంటనే వస్తుంది అని ప్రేక్షకులు ఎదురుచూశారు. కానీ షూటింగ్ ఆగిపోయిందని పుకార్లు వచ్చాయి తప్ప అప్డేట్స్ ఎం రాలేదు. అయితే మొన్ననే నాని ప్రీ లుక్ ని విడుదల చేశారు.   
 
ప్రీ లుక్ ని విడుదల చేసిన సమయంలోనే గ్యాంగ్ లీడర్స్ అప్ డేట్స్ ఇస్తారు అనేది లిస్ట్ ఇచ్చారు. ఈ నెల 15 ఫస్ట్ లుక్‌, 18న ఫస్ట్‌ సాంగ్‌, 24న టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేశారని ఒక పోస్టర్ ని విడుదల చేశారు. అలానే 15న గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్‌ విడుదల చేశారు. ఈరోజు సాయింత్రం 7 గంటలకు ఫస్ట్ సాంగ్ విడుదల చేయనున్నట్టు నాని ప్రకటించారు. 

దీంతో నాని ప్రేక్షకులు ఫస్ట్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఆగష్టు 30న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కానీ ఆగష్టు 15న విడుదల అవ్వాల్సిన సాహూ సినిమా 30వ తేదికి వాయిదా పడటంతో నాని గ్యాంగ్ లీడర్ రిలీజ్ అవుతుందా అనే ఆలోచనలో పడ్డారు నాని అభిమానులు. 


A day before the simba roars🦁
We as a GANG roar together 🔥

RA .. RA ...#RoarOfTheRevengers
First song from #GANGLEADER
Today @7PM

An @anirudhofficial Musical pic.twitter.com/mxMEUF1xo0

— Nani (@NameisNani) July 18, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: