మీడియా సమావేశంలో మహేష్ బాబు కాలర్ ఎందుకు ఎగర వేశాడో తెలిస్తే షాక్ అవుతారు…!
ముఖ్యంగా మహర్షి సినిమా తన జీవితంలో మర్చిపోలేని సినిమా అని మూడు సంవత్సరాల క్రితం ఈ కథ విని దిల్ రాజు గారు క్లాసికల్ సినిమా అని తర్వాత ఈ కథ విన్న మరో నిర్మాత అశ్వినీ దత్ గేమ్ చేంజర్ సినిమా అని తెలపడంతో..ఈ రెండు కామెంట్లు నాకు సినిమా చేయడానికి మంచి బూస్ట్ ఇచ్చిందని పేర్కొన్నారు మహేష్. ఇంకా మహేష్ మాట్లాడుతూ నేను క్రికెట్‌కు చాలా పెద్ద ఫ్యాన్‌ని.
2011 వరల్డ్ కప్ ఫైనల్‌కు వెళ్లాను. చివర్లో దోని సిక్స్ కొట్టినప్పుడు చాలా సంతోషపడ్డాను. అప్పుడు ఎంత ఆనందం వేసిందో దిల్‌రాజుగారు సిక్సర్ కొట్టాం అనగానే అంతే ఆనందం వేసింది. మూడు పెద్ద బ్యానర్స్ లో నా సినిమా తెరకెక్కడం గర్వంగా ఉంది. సాధారణంగా దత్తుగారు ప్రిన్స్ .. బాబు అని పిలుస్తుంటారు. విపరీతంగా నచ్చినప్పుడు మాత్రమే మహేష్ అని పిలుస్తారు. అలా ఎప్పుడు పిలుస్తారా? అని ఎదురుచూస్తుంటాను. ఈ సినిమా చూసిన తర్వాత ఆయన అలా పిలిచారు“ అని అన్నారు. మొత్తానికి మహేష్ చాలా క్యాలిక్యులేషన్స్ తర్వాతనే ఇలా కాలర్ ఎగురవేసారని అర్థమవుతోంది.