‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ అందుకే వాయిదా!

Edari Rama Krishna

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో వరుసగా బయోపిక్ చిత్రాలు రూపొందుతున్నాయి. తెలుగు లో మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర..ఈ మద్య లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అయ్యింది.  బాలీవుడ్ లో దోని, సంజు, థాక్రే ఇలా పవు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా చేసుకొని వివేక్ ఒబేరాయ్ ప్రదాన పాత్రలో ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ రూపొందిన విషయం తెలిసిందే. 


ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ 5న విడుదల కావడం లేదని నిర్మాత సందీప్ సింగ్ వెల్లడించారు. మా చిత్రం ‘పీఎం నరేంద్రమోదీ’ ఏప్రిల్ 5న విడుదల కావడం లేదు. విడుదలకు సంబంధించిన అప్‌డేట్ త్వరలో అందిస్తామని సందీప్ సింగ్ ట్వీట్ చేశారు. ఎన్నికల వేళ ‘పీఎం నరేంద్రమోదీ’ చిత్రం విడుదల కాకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ నేత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.


పిటిషన్ ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకున్న నేపథ్యంలో..చిత్రం విడుదల ఆలస్యం కానుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పీఎం నరేంద్రమోదీ చిత్రం బీజేపీకి రాజకీయంగా లబ్ధిచేకూర్చేవిధంగా ఉందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.


This is to confirm, our film 'PM Narendra Modi' is not releasing on 5th April. Will update soon.

— Sandip Ssingh (@sandip_Ssingh) April 4, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: