దిల్ రాజ్ తో మరోసారి ఛాన్స్ కొట్టేశాడు!

siri Madhukar
టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించాలని వచ్చిన వారు హీరోలుగా మారిన విషయం తెలిసిందే.  రవితేజ, నాని లాంటి వారు మొదట డైరెక్టర్లు కావాలని భావించిన వారే..కానీ అనుకోకుండా హీరోలుగా సెటిల్ అయ్యారు.  ఇక షార్ట్ ఫిలిమ్స్ కి డైరెక్టర్ చేస్తూ ‘ఉయ్యాల జంపాల’సినిమాతో హీరోగా మారాడు రాజ్ తరుణ్.  ఈ సినిమా మంచి విజయం అందుకుంది. తర్వాత సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్,సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, ఈడోరకం ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు లాంటి సినిమాలతో మోస్తారు విజయాలు అందుకున్నాడు. 

అప్పట్లో చిన్న నిర్మాతలకు ఈ హీరో మంచి కల్పతరువుగా మారాడు.  కానీ రాజ్ తరుణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మాత్రం కొట్టలేక పోయాడు.  గత ఏడాది ఆయనను వరుస పరాజయాలు పలకరించాయి. దాంతో సహజంగానే అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆయన దిల్ రాజు ప్రాజెక్టులో ఛాన్స్ దక్కించుకున్నాడు రాజ్ తరుణ్. 

గతంలో దిల్ రాజు బ్యానర్లో 'లవర్' తో పరాజయాన్ని చవిచూసిన రాజ్ తరుణ్, మళ్లీ అదే బ్యానర్లో అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం.  తాజాగా  కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమాకి 'నీది నాది ఒకటే లోకం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ నెల 3వ వారంలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: