ఆ తెలుగు స్టార్ హీరో సినిమాలో జ్యోతిక.. ఏకంగా అలాంటి పాత్రలో..!?

Anilkumar
సీనియర్ హీరోయిన్ జ్యోతిక ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం వరుస అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది. అయితే తాజాగా ఇప్పుడు ఒక తెలుగు స్టార్ హీరో సినిమాలో తనకి అవకాశం వచ్చినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. మరి ఆ స్టార్ హీరో ఎవరు.. ఆ స్టార్ హీరో సినిమాలో జ్యోతిక ఎలాంటి పాత్రలో కనిపించబోతుంది అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. కేవలం

 తెలుగులోనే కాకుండా హిందీలో కూడా పలు సినిమాలు చేసింది. అయితే తాజాగా ఇప్పుడు మళ్ళీ తెలుగులో మరో సినిమా చేయడానికి కమిట్ అయినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అది కూడా ఒక తెలుగు హీరో సినిమాలో అని అంటున్నారు .అంతేకాదు ఆ స్టార్ హీరోకి జ్యోతిక తల్లి పాత్రలో కనిపించబోతుందన్న సమాచారం వినబడుతోంది .మరి ఆ స్టార్ హీరో ఎవరో కాదు అక్కినేని నాగచైతన్య. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్  సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ మూవీ తర్వాత కార్తీక్ వర్మ దండుతో మరొక సినిమా చేయడానికి

 ఇప్పటికె గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విరూపాక్ష వంటి కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతోంది అన్న సమాచారం వినబడుతోంది. అయితే కార్తీక్ వర్మ నాగచైతన్య కాంబోలో వస్తున్న ఈ సినిమాలో జ్యోతిక నాగచైతన్యకి తల్లి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా కూడా పూజ హెగ్డే ను సెలెక్ట్ చేసినట్లుగా వినికిడి. దీంతో ఇదే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమా కోసం జ్యోతిక కు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయం నిజమా అబద్దమా అన్న తెలియాలి అంటే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇకపోతే గతంలో జ్యోతిక అక్కినేని నాగార్జున కాంబినేషన్లో వచ్చిన మాస్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు నాగార్జున కొడుకుతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది జ్యోతిక..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: