"హీరామండి 2" అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
మనిషా కొయిరాలా , సోనాక్షి సిన్హా , అదితి రావు హైదరి , రిచా చ‌ద్దా, సంజీదా షేక్, ష‌ర్మిన్ సెగ‌ల్ ప్రధాన పాత్రలలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకు లలో ఒకరు అయినటు వంటి సంజయ్ లీలా బాన్సాలి దర్శకత్వం లో హిరామండి అనే వెబ్ సిరీస్ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే . అత్యంత క్రేజ్ కలిగిన నటీమణులు ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించడం , ఇండియా లోనే తనకంటూ దర్శకుడిగా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకుల లో ఒకరు అయినటు వంటి సంజయ్ లీలా బన్సాలి మొట్ట మొదటి సారి డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం ఓ వెబ్ సిరీస్ ను రూపొందించడం తో ఈ వెబ్ సిరీస్ పై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది . ఇలా ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం  తో తాజా గా ఈ వెబ్ సిరీస్ దర్శకుడు అయినటువంటి సంజయ్ లీలా  భన్సాలీ ఈ సిరీస్ కు సీక్వెల్ ఉండబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు . ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ 2026 వ సంవత్సరం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది . ఇక ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ మంచి సక్సెస్ కావడం తో రెండవ సీజన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

slb

సంబంధిత వార్తలు: