అఫిషియల్ : ఆ "ఓటిటి" లోకి బాక్..!

Pulgam Srinivas
ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు కలిగిన నటీమణులు అయినటువంటి తమన్నా , రాసి కన్నా ప్రధాన పాత్రలలో సుందర్ సి దర్శకత్వంలో తమిళ్ లో "అరన్మయి 4" అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను తమిళ్ తో "అరన్మై 4" అనే టైటిల్ టి విడుదల చేయగా తెలుగు లో బాక్ అనే టైటిల్ తో తమిళ్ , తెలుగు భాషల్లో ఒకే తేదీన విడుదల చేశారు. ఇక ఈ సినిమాకి తమిళ్ లో బ్లాక్ బాస్టర్ టాక్ రాగా , తెలుగులో మంచి టాక్ లభించింది.
 

ఇక ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించడంలో భారీగా సక్సెస్ కాలేదు. కాకపోతే పర్వాలేదు అనే స్థాయి లో అలరించే హిట్ ను స్టేటస్ ను అందుకుంది. ఇక తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ మూవీ కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది అని మొదట వార్తలు వచ్చాయి.

కాకపోతే ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాని మరికొన్ని రోజుల్లోనే తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాట్ ఫామ్ వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సంస్థ వారు ఈ సినిమాను తమిళ్ , తెలుగు , మలయాళ , కన్నడ నాలుగు భాషలలో మరికొన్ని రోజుల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: