అరుదైన రికార్డ్ తో శర్వానంద్ !

Seetha Sailaja
మీడియం రేంజ్ హీరోలలో శర్వానంద్ సినిమాలు కొంతమేరకు డిఫరెంట్ గా ఉంటాయి. అయితే మాస్ ప్రేక్షకులలో ఈ హీరోకు చెప్పుకోతగ్గ స్థాయిలో ఇమేజ్ ఏర్పడకపోవడంతో ఇతడి సినిమాల కలక్షన్స్ రికార్డులను క్రియేట్ చేయలేకపోతున్నాయి. అయితే శర్వానంద్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘మనమే’ ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

చైల్డ్ సెంటిమెంట్ మరియు కామెడీ జోనర్ లో ఒక డిఫరెంట్ కథతో జూన్ లో విడుదలకాబోతున్న ఈమూవీలో 16 పాటలు ఉంటాయని ఈమూవీ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. సాధారణంగా ఇప్పుడు వస్తున్న సినిమాలలో నాలుగు లేదా 5 కు మించి పాటలు ఉండటంలేదు. ఆ పాటల ట్యూన్స్ కూడ చాల క్యాచీగ ఉంటేనే ప్రేక్షకులు పట్టించుకుంటున్నారు లేదంటే బోర్ ఫీల్ అవుతున్నారు.

గతంలో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్ళి సందడి’ మూవీలో 12 పాటలు ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఏమాత్రం బోర్ ఫీల్ అవ్వకుండా అప్పట్లో ఆసినిమా సూపర్ హిట్ చేశారు. ఒకప్పుడు బాలీవుడ్ కలక్షన్స్ లో చరిత్ర సృష్టించిన ‘హమ్ ఆప్ కె హై కౌన్’ మూవీలో 14 పాటలు ఉన్నప్పటికీ ఆమూవీ సూపర్ సక్సస్ అయింది. అయితే ప్రస్తుత తరం ప్రేక్షకుడు తాము చూసే సినిమాలలో ఎక్కువ పాటలు ఉంటే తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఇప్పుడు ఆ ట్రెండ్ ను మార్చడానికి ‘మనమే’ ఒక ప్రయత్నం చేస్తోంది అనుకోవాలి.

ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈమూవీ పై శర్వానంద్ చాల ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం మ్యూజిక్ సెన్సేషన్ గా మారుతున్న హేశం అబ్దుల్ వహాబ్ తన కెరీర్ లోనే ఇది బెస్ట్ వర్క్మూవీగా ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవాలని శ్రీరామ్ ఆదిత్య అంటున్నాడు ‘ఒకే ఒక జీవితం’ రెండేళ్ల గ్యాప్ తరువాత శర్వానంద్ ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలా సక్సస్ అవుతాడో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: