ప్రభాస్ హీరోగా
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో
కల్కి 2898 ఏడి అనే
మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ ని
జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను భారీ ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని పనులు కూడా ముగియడంతో ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాలో బిజినెస్ ను కూడా ఈ
మూవీ బృందం వారు క్లోజ్ చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ
సినిమా రన్ టైమ్ ను ఇప్పటికే ఈ
మూవీ బృందం లాక్ చేసింది. ఈ
మూవీ భారీ రన్ టైం తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ
మూవీ ని యూఎస్ ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రత్యంగిర సినిమాస్ సంస్థ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. అందులో
జూన్ 26 వ తేదీకి సంబందించిన ప్రీమియర్ షో ల అడ్వాన్స్ బుకింగ్స్ ను
జూన్ 8 వ తేదీన లేదా అంతకు ముందు స్టార్ట్ కానున్నట్లు వెల్లడించింది.
ఇక అందులో భాగంగా ఈ
మూవీ రన్ టైమ్ ను కూడా ప్రకటించారు. 2 గంటల 50 నిమిషాల రన్ టైం తో
సినిమా ఉండబోతుంది అని ఈ సంస్థ వారు పోస్ట్ చేసిన పోస్ట్ లో ఉంది. ఇలా ఈ
సినిమా బారి రన్ టైం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కన్ఫామ్ అయ్యింది. మరి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలను ఈ
మూవీ అందుకున్నట్లు అయితే భారీ కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ
మూవీ లో దీపికా పదుకొనే ,
దిశా పటాని హీరోయిన్లుగా కనిపించనుండగా , కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అమితా బచ్చన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.