ఏపీ: ఎంపీ సీట్లు అత్యధికంగా గెలవబోయే పార్టీ అదే!

Suma Kallamadi
మరికొన్ని గంటల్లో ఎన్నికల రిజల్ట్స్ కౌంటింగ్ మొదలవ్వాల్సింది ఉండగా ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ అనేవి జనాలను ఒకింత ఎక్సయిట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారికి వారు గెలుస్తామని ధీమాని వ్యక్తం చేస్తున్న పరిస్థితి వుంది. అవును, ఏపీలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటరు నాడి ఎటువైపు ఉందనే అంశంపై నిన్న పలు ఎగ్జిట్ పోల్స్ వెలువడిన సంగతి విదితమే. లోక్ సభ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు ఎన్డీయే కూటమివైపు అత్యధికంగా మొగ్గారని దాదాపు అన్ని జాతీయ ఎగ్జిట్ పల్స్ తేల్చి చెప్పాయి. అయితే ఒక్క టైమ్స్ నౌ మాత్రం లోక్ సభ పోరులో వైసీపీకి ఆధిక్యాన్ని చూపిస్తూ అంచనాలను వెలువరించింది.
కాగా అసెంబ్లీ ఎన్నికలపై మాత్రం నిన్న జాతీయ ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయం వెల్లడించింది. ఏపీ అసెంబ్లీలోని 175 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఈసారి ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించబోతోందని పలు దిగ్గజ మీడియా సంస్థలు తేల్చి చెప్పాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 98 నుంచి 120 సీట్లు లభిస్తాయని అంచనా. ఇక వైసీపీకి మాత్రం 55-77 సీట్లు లభించే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పుకొచ్చాయి ఆయా సంస్థలు. అంటే దాదాపు 50 సీట్ల తేడాతో ఎన్డీయే కూటమి ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోబోతోందని అర్ధం అవుతోంది. అవును, రాష్ట్రంలో పురుషుల్లో 54 శాతం.. మహిళల్లో 48 శాతం మంది ఎన్డీఏ కూటమికి జై కొట్టినట్టు ఆయా సంస్థలు చెప్పుకొచ్చాయి.
ఇక ఎంపీ స్థానాల విషయానికొస్తే ఒకటి ఆరా మినహా మిగతావన్నీ ఎన్డీయే కూటమికే వచ్చే అవకాశమే మెండుగా ఉందని పలు పోల్స్ చూస్తేనే అర్ధం అయిపోతుంది. కాబట్టి ఈసారి అధికార వైసీపీ పార్టీ ఇరువైపులా భారీగా నష్టపోనుందని చాలా స్పష్టంగా అర్ధం అవుతోంది. అయితే అంచనాలు ఎలా ఉన్నప్పటికీ వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మాత్రం గెలుపు ధీమాని వ్యక్తం చేస్తుండడం వారి మేకపోతు గాంభీర్యానికి నిదర్శనము అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకూ నిజం అవుతాయి? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది! ఇక మీరేం అనుకుంటున్నారో ఇక్కడ మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: