అంతాటో పరిస్థితి.. ఏపీ లో ఓ పరిస్థితి.. ఎగ్జిట్ పోల్స్ నమ్మాలా.. వద్దా..?

Pulgam Srinivas
గత కొన్ని రోజులుగా చాలా విడతల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు చాలా విడుదల్లో ఇప్పటికే జరగగా కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఇకపోతే దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు రేపు అనగా జూన్ 4 వ తేదీన విడుదల కానున్నాయి. ఈ ఫలితాల విడుదలకు ముందు ఇప్పటికే అనేక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రూపంలో నిర్వహించిన సర్వే నివేదికలను విడుదల చేశాయి. అందులో భాగంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితి నెలకొంది.

కొన్ని ప్రాంతాలలో ఎగ్జిట్ పోల్స్ ఈ పార్టీ గెలుస్తుంది , ఆ పార్టీ గెలుస్తుంది అని చెబుతూ వచ్చాయి. ఇక చాలా రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ శాతం ఒకే పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పిన సందర్భంలో ఆపోజిట్ పార్టీలు ఎగ్జిట్ పోల్స్ నివేదికలను నమ్మాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాలలో వారు ఇచ్చిన నివేదికలకు , ఫలితాలకు ఏమాత్రం సంబంధం లేకుండా జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ను మేము ఏ మాత్రం నమ్మం , ప్రజలు ఇచ్చిన తీర్పు ఏమిటి అనేది జూన్ 4 వ తేదీన వస్తుంది. దాని కోసం వేచి చూస్తున్నాం అని చెబుతున్నారు. ఇక ఆంధ్రాలో మాత్రం వేరే పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా వై సి పి , కూటమి మధ్య పోరు ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పటికే చాలా వరకు విడుదల అయ్యాయి. అందులో కొన్ని వైసిపి అధికారం లోకి వస్తుంది అంటే , మరికొన్ని కూటమి అధికారంలోకి వస్తుంది అని చెబుతున్నాయి. దానితో ఎగ్జిట్ పోల్స్ రాంగ్ అని వైసిపి చెప్పలేక పోతుంది , కూటమి చెప్పలేకపోతోంది. ఎందుకు అంటే వీరిద్దరికీ కొన్ని సర్వే సంస్థలు పాజిటివ్ రిపోర్ట్ ను ఇస్తే , మరికొన్ని నెగటివ్ ఇచ్చాయి  కాబట్టి మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో తెలియాలి అంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: