మరో జాతీయ సర్వే.. ఏపీలో ఆ పార్టీకే అధికారం?

Suma Kallamadi
ఏపీలో గతంలో ఎన్నడూ లేనంతగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. గెలుపు తమదేనని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ధీమాగా ఉన్నాయి. ఇక ఏపీలో ఎన్నికలపై వివిధ జాతీయ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు తమ సర్వే ఫలితాలను అత్యంత ఖచ్చితంగా చెప్పాయి. మరికొన్ని మాత్రం ఏపీలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను సైతం తప్పుగా పేర్కొనడంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. జాతీయ సర్వేలపై ఎక్కువ మందికి నమ్మకం ఉంటుంది. ఆయా సంస్థలు చేసే చిన్న పొరపాట్లు విమర్శలకు కారణమవుతాయి.

 అయితే ఖచ్చితత్వంతో చేసే సర్వేలకు మాత్రం ప్రజల్లో నమ్మకం ఉంటుంది. ఇలా లోక్ సభ చివరి విడత ఎన్నికలు జరిగిన వెంటనే విడుదలైన ఫలితాలకు మిశ్రమ స్పందన వచ్చింది. సర్వే సంస్థల ఫలితాలను విశ్లేషిస్తే అసెంబ్లీకి, లోక్‌సభకు భిన్నమైన ఫలితాలను అవి విడుదల చేశాయి. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా గందరగోళం ఏర్పడింది. మెజారిటీ సంస్థలు టీడీపీ కూటమి అధికారం చేపడుతుందని చెప్పాయి. అయితే పోల్ స్ట్రాటజీ, జన్ మత్, పార్థాచాణక్య, పొలిటికల్ క్రిటిక్, ఆరా మస్తాన్ వంటివి ఏపీలో వైసీపీ మరోసారి అధికారం చేపడుతుందని చెప్పేశాయి.
ఇదే కోవలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరో జాతీయ సంస్థ నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. జాతీయ మీడియాలో పేరొందిన టౌమ్స్ నౌ-ఈటీజీ సంస్థ తాజాగా తన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. ఇప్పటి వరకు ఇతర జాతీయ మీడియా సంస్థలు విడుదల చేసిన ఫలితాలకు ఇది భిన్నంగా ఉంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి రానుందని ఈ సర్వే వెల్లడించింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కేవలం ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని పేర్కొంది.

ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గల మెజారిటీ మార్క్ 88ని వైసీపీ ఈజీగా క్రాస్ చేస్తుందని ఈ సర్వే పేర్కొంది. వైసీపీకి 117 నుంచి 125 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. వైసీపీకి రాష్ట్రంలో 51 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. మరో వైపు ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 50 నుంచి 58 మాత్రమే రావొచ్చని అభిప్రాయపడింది. అయితే కూటమికి 48 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం 2024లో మహిళల ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపింది. ఇది గతంలో కంటే 15 శాతం ఎక్కువని వివరించింది. ఎక్కువ సంఖ్యలో మహిళలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందారని, అది తమకే లాభిస్తుందని వైసీపీ ధీమాగా ఉంది. లోక్‌సభ స్థానాల విషయంలో వైసీపీ 13 నుంచి 15 వరకు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ సంస్థ పేర్కొంది. టీడీపీ కూటమికి 10 నుంచి 12 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: