"ఎన్టీఆర్-1" అపజయానికి.. బాబు కారణమా..? అదెలా..?

Chakravarthi Kalyan
సంక్రాంతికి విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. తెలుగు ప్రజల్లో ఎన్టీఆర్‌కు ఉన్న స్థానాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎన్టీఆర్ కథానాయకుడు అపజయం చెందినట్టే లెక్క. సావిత్రి బయోపిక్కే సూపర్ డూపర్ హిట్ కాగా లేనిది ఎన్టీఆర్ బయోపిక్ ఇంకా ఏ లెవల్లో ఆడాలి.. అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.



ఎన్టీఆర్ కథానాయకుడి అపజయానికి పరోక్షంగా చంద్రబాబు కారణమన్న వాదన కూడా వినిపిస్తోంది. అదేంటీ చంద్రబాబుకూ ఎన్టీఆర్ బయోపిక్‌కూ సంబంధం ఏంటి.. ఇది మరీ తలాతోకాలేని వాదనలా ఉందే అనిపిస్తోంది కదూ.. కానీ వాస్తవం అదేనట. ఓ మనిషి జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను సమర్థంగా చూపించినప్పుడే బయోపిక్‌లు విజయం సాధిస్తాయి.



ఈ విషయాన్ని ఇప్పటికే అనేక సినిమాలు రుజువు చేశాయి. కానీ ఎన్టీఆర్ బయోపిక్‌కు అదే మైనస్ పాయింట్ అయ్యింది. నిర్మాత బాలయ్య ఎమ్మెల్యే కావడం.. ఆయన బావ సీఎం కావడం.. ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు కావడం వల్ల.. ఆయన జీవితంలోని చాలా డ్రామాను వెండితెరపై ఆవిష్కరించలేదు.



తమ పార్టీకి ఎలాంటి చెడ్డపేరు రాకూడదన్న ఆకాంక్ష।.. రాజకీయంగా లాభం కలగాలన్న కోరిక.. వాస్తవాన్ని చిత్రీకరించేందుకు అడ్డుపడ్డాయి. దీంతో ఎన్టీఆర్ కథానాయకుడు ఓ డాక్యుమెంటరీలా తయారై ఆసక్తి లేకుండా తయారైంది. కేవలం అభిమానులకు మాత్రమే చేరువై.. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించింది. అందుకే ఎన్టీఆర్ కథనాయకుడి పరాజయానికి చంద్రబాబు కూడా కారణమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: