గుడివాడ : కొడాలిపై టీడీపీ వ్యూహం ఫలించేనా..?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. మరో పదనాల్గు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాలు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే టిడిపి పార్టీ  గుడివాడలో ఒక కొత్త విషయాన్ని అమలు చేస్తుంది. అక్కడ టిడిపి గెలవడం కష్టం అని భావించిందేమో తెలియదు గాని కొత్తగా వైసీపీ అభ్యర్థి అయినటువంటి కొడాలి నాని రేసులో లేరనే భారీగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ టిడిపి అభ్యర్థిగా వెలిగండ్ల రాముకి టికెట్ కేటాయించింది టిడిపి పార్టీ అధిష్టానం. ఈ వెనిగళ్ళ రాముది స్థానికంగా గుడివాడైనప్పటికీ కూడా ఆయన వ్యాపార రీత్యా అమెరికాలో ఎక్కువ కాలం నుండి ఉంటున్న వ్యక్తి.రాజకీయాలపై ఇంట్రెస్ట్ తో ఆయన అమెరికా నుండి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి టికెట్ ఆశించడంతో ఆయనకి టికెట్ దొరికింది. నియోజకవర్గంలో తన ప్రచారంలో తాను సాఫీగా ముందుకు పోతున్నారు.

స్థానికంగా వైసిపి అభ్యర్థి కొడాలి నాని గత ఎన్నికలలో గుడివాడ నుంచి గెలిచి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు. సుదీర్ఘకాలంగా ఆయన అక్కడే ఉన్న ఉన్నారు కొడాలి నాని పై కొంత వ్యతిరేకత చోటు చేసుకుంది. అయితే టిడిపి దీన్ని  ఉపయోగించుకోవచ్చు కానీ తాజాగా కొడాలి నాని సిరివిట్లో తేడాలు ఉన్నాయని రిటర్నింగ్ ఆఫీసర్ కి టిడిపి నేతలు కంప్లైంట్ చేశారు. అయితే దాన్ని లెక్కలోకి పరిగణించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ కొడాలి నాని అభ్యర్థిత్వాన్ని కన్ఫామ్ చేశారు. కార్పొరేషన్ సంస్థకు సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ ని అద్దెకు తీసుకున్నారు దానికి ప్రతినెల అద్దె చెల్లిస్తున్నారు. కాకపోతే టిడిపి కొడాలి నాని అఫిడవిట్లో ఆ బిల్డింగ్ ప్రస్తావన తీసుకురాలేదని లిఖితపూర్వకంగా కంప్లైంట్స్ ఇచ్చారు. దీని ఆధారం చేసుకుని టిడిపి నేతలు సోషల్ మీడియాలో కొడాలి నాని యొక్క అభ్యర్థిత్వాన్ని శంకిస్తూ ఆయన పోటీకి అనర్హుడని ఎన్నికల బరిలో నిలబడటం లేదని ప్రచారం భారీగా చేస్తున్నారు.అయితే వైసీపీ నేతలు దీన్ని తిప్పి కొట్టే ప్రయత్నంలో భాగంగా టిడిపి అధిష్టానం గురించి వారు కూడా భారీగా ప్రచారం చేస్తున్నారు.ఈ విధంగా గుడివాడ పాలిటిక్స్ టిడిపి వర్సెస్ వైసీపీ హాట్ హాట్ గా కొనసాగుతుంది. దీన్ని మొత్తాన్ని గమనిస్తున్నటువంటి గుడివాడ ప్రజలు ఇంకొక రెండు వారంలో తమ ఓటు ద్వారా వారి నిర్ణయం ప్రకటించడం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: