ఉమ్మడి గుంటూరు : వైసీపీకి షాక్ మీద షాక్ ఇస్తున్న నేతలు..?

FARMANULLA SHAIK
ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తెదేపాలో చేరికలు ఊపందుకున్నాయి. కొద్దిరోజుల నుంచి అనేక మంది వైకాపా నాయకులు ఆ పార్టీని వీడటం పార్టీ వర్గాల్లో గుబులు రేపుతోంది.గత కొంతకాలంగా వైసీపీలో మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గుంటూరు వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌కు పంపించారు. అనంతరం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. తెదేపా-జనసేన భాగస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుందనే నమ్మకంతో చాలామంది సైకిల్‌ ఎక్కుతున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల ప్రతి నియోజకవర్గంలో వైకాపాకు చెందిన పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, కౌన్సిలర్లు నామినేటెడ్‌ పదవులు కలిగిన వారితో పాటు ఆ పార్టీకి చెందిన గ్రామ, మండలస్థాయి నేతలు తెదేపాలో చేరుతుండటంతో ఆ పార్టీ వర్గాల్లో ఉత్సాహం నెలకొంటోంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక వృద్ధులైన తల్లిదండ్రులను విడిచిపెట్టి బతుకుదెరువు కోసం వెళ్లిపోతున్నారని ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే వీరంతా తెదేపాలో వచ్చి చేరుతున్నారని చెబుతున్నారు.అయితే వైసీపీ కి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఇచ్చిన షాక్ నుండి కోలుకోక ముందే బాపట్ల మాజీ ఎమ్మెల్యే కొత్త షాక్ ఇచ్చారు.ప్రస్తుతం బాపట్ల జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.  రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు  వేడెక్కాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.బాపట్ల వైసిపి సీనియర్‌ నాయకులు, మాజీ శాసన సభ్యులు చీరాల గోవర్ధన్‌ రెడ్డి, టిడిపి, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరారు.అధికార వైసీపీ వల్ల అసంతృప్తి చెందిన కారణంగా పార్టీని విడాల్సి వచ్చిందన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: