టివి: బిగ్ బాస్ వల్ల జీవితాలు నాశనమయ్యాయి.. రవి హాట్ కామెంట్స్..!
ముందుగా రవి మాట్లాడుతూ బిగ్ బాస్ గురించి తెలియజేస్తూ.. బిగ్ బాస్ ఫ్యాన్స్ కాదు హిందీలో బిగ్ బాస్ 1,2 సీజన్లను చూశాను ఎక్కువగా వాటినే ఫాలో అయ్యేవాడిని కాదు.. కానీ మాటీవీలోనే పెరిగాను కాబట్టే.. అందులో పార్టిసిపేషన్ చేయొచ్చు కదా అని చాలామంది అడిగేవాళ్లు అలా మొదటి సీజన్ నుంచి చివరికి నాలుగో సీజన్ సమయంలో టాప్ లో ఉండడంతో బిగ్ బాస్ వాళ్లు తనని రమ్మన్నారని అది తన కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పారని వెల్లడించారు.. అందుకే ఆ సమయంలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చానని తెలిపారు.
అలాగే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తన తోటి కంటెంట్లతో గొడవల పైన రవి మాట్లాడుతూ.. బిగ్ బాస్ షో చూసి ఎవరిని కూడా జడ్జ్ చేయకూడదు..అందులో చాలామంది జీవితాలు కూడా నాశనం అయ్యాయి.. బిగ్బాస్ షో లో కేవలం ఒక స్టోరీని మాత్రమే చూపిస్తారు .. దీనివల్లే చాలామంది జడ్జ్ చేస్తూ ఉంటారు. కానీ తన కూతురిని హౌస్ లోకి వెళ్ళిన 15 రోజుల తర్వాత మొహం ఎలా ఉంటుందో మర్చిపోయో పరిస్థితి ఉన్నది.. అంత స్ట్రెస్ లోపల ఉంటుంది అంటూ తెలిపారు.. ముఖ్యంగా తన చుట్టూ అమ్మాయిలు ఉంటేనే రవి యాంకర్ గా చేస్తారని విమర్శలు కూడా వినిపించాయి.. కేవలం స్క్రీన్ పైన గ్లామర్ ఉంటేనే కొంతమంది చూస్తారని అందుకే అలా చేస్తామని వెల్లడించారు. ఏది ఏమైనా బిగ్ బాస్ వల్ల చాలామంది కెరియర్ నాశనం అయ్యిందని తెలిపారు.