ఏపీ: నంద్యాల లోక్‌సభ నామినేషన్ల విషయంలో టీడీపీ నేతల మధ్య వాగ్వాదం..??

Suma Kallamadi
నంద్యాలలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో అంతర్గతంగా పెద్ద కలహాలే జరుగుతున్నాయి. నంద్యాల లోక్‌సభ స్థానానికి వేసిన నామినేషన్ల విషయంలో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల నంద్యాల లోక్‌సభ స్థానానికి టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె శబరి నామినేషన్ దాఖలు చేశారు. అదే సీటు కోసం మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ కూడా ఆమె భర్త భార్గవ్‌రామ్‌తో కలిసి రేసులోకి దిగారు.
తమ నుంచి డబ్బులు పొందాలని అఖిల ప్రియ నామినేషన్‌ను భర్త చేత వేయించారని బైరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన కుమార్తె పేర్కొన్నారు. అఖిల ప్రియ, ఆమె భర్త తమ నామినేషన్ ఉపసంహరణకు బదులుగా గణనీయమైన మొత్తంలో డబ్బు కోరినట్లు వారు ఆరోపించారు. ఈ విషయం కాస్త టీడీపీ అధిష్టానానికి తెలిసింది. పరిస్థితి విషమించడంతో టీడీపీ నేతలు దృష్టి సారించారు. మొదట్లో చెల్లింపులు చేస్తే తప్ప నామినేషన్ ఉపసంహరించుకోమని భూమా అఖిలప్రియ మండిపట్టు పట్టినట్లు తెలిసింది. ఈ తీరుపై పార్టీలోని పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే బెదిరించో బతిమిలాడో టీడీపీ అఖిల ప్రియను విత్ డ్రాకు ఒప్పించినట్లు సమాచారం. భర్త భార్గవ్ రామ్ తమ నామినేషన్ ఉపసంహరణకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసినట్లు సమాచారం. సోమవారంతో నామినేషన్‌ ఉపసంహరణకు గడువు ఉంది. నంద్యాల జిల్లాలో ఇరువర్గాలు ఆధిపత్యం కోసం పోటీ పడుతుండడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తీవ్రమైంది. టీడీపీ నాయకత్వ చర్యలు రానున్న ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరోవైపు చంద్రబాబు నాయుడు జగన్ పై షాకింగ్ కామెంట్లు చేస్తూ నెగెటివిటీని పెంచుకుంటున్నారు. జగన్ ను రాళ్లతో కొట్టి చంపాలంటూ ఆయన చేస్తున్న కామెంట్స్ పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఏది ఏమైనా చంద్రబాబు చాలా ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారని ఆయన మాటలను బట్టి స్పష్టంగా అర్థం అవుతుంది. ఒకవేళ గెలుపు ఆయనకు వ్యతిరేకంగా వస్తే ఏమవుతారు అనే ఆందోళన కూడా టీడీపీ తమ్ముళ్లలో నెలకొన్నది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: