సరికొత్త లుక్ లో షాక్ ఇచ్చిన హీరో యష్..!?

Anilkumar
ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ హీరో యష్. కేజిఎఫ్ సినిమానే ఆయనను ఈ స్థాయికి తీసుకువెళ్లాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా కంటే ముందు ఎంతో లోతున ఉన్న కన్నడ ఇండస్ట్రీని ఫ్యాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టింది కే జి ఎఫ్ సినిమా నే అని చెప్పాలి. అయితే కేజీఎఫ్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో చేస్తున్న సినిమాలన్నిటిపై కూడా ప్రస్తుతం భారీ అంచనాలు ఉంటున్నాయి.

అయితే కేజీఎఫ్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న హీరో తాజాగా  మోహన్ దా స్ దర్శకత్వంలో టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ చాలా రోజుల క్రితమే ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా కోసం తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. యష్. ప్రస్తుతం తన లేటెస్ట్ లుక్ తో ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం యష్ కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇన్ని రోజులు ఫుల్ గడ్డంతోనే కనపడ్డాడు యశ్. కానీ తాజాగా ఇవాళ గడ్డం కొంచెం తగ్గించి యశ్ కొత్త లుక్ లో కనపడ్డాడు. కర్ణాటకలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో యశ్ ఓటు వేయడానికి వచ్చాడు. దీంతో యశ్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.యశ్ ఇంకాస్త స్టైల్ గా మారి, కళ్ళజోడు పెట్టుకుని.. నవమన్మధుడిలా దర్శనం ఇచ్చాడు. దాంతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇది ఖచ్చితంగా టాక్సిక్ లుక్ అని ఆడియన్స్ కనిపెట్టేశారు. టాక్సిక్ సినిమా అనౌన్స్ గ్లింప్స్ లో కూడా యశ్ గడ్డంతో కనిపించడంతో ఇది కచ్చితంగా టాక్సిక్ సినిమా లుక్ అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: