తెనాలి: అన్నాబత్తిని శివకుమార్ కు ఈసీ షాక్..!

Pandrala Sravanthi
ఏపీలో ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అంతా సాఫీగా పోలింగ్ జరుగుతున్న తరుణంలో శివకుమార్ అలజడి సృష్టించారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం..  రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలి..ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో తప్పనిసరిగా కొన్ని  నియమాలు పాటించాలి. ఎవరైనా సరే క్యూ లైన్ లో నిలబడాల్సిందే. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా అంటే నడవదు. కానీ తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తిని శివకుమార్ మాత్రం ఎలాంటి క్యూలైన్ లేకుండా డైరెక్ట్ గా వెళ్లి ఓటు వేయాలని ప్రయత్నించాడు. 

దీంతో ఆగ్రహించిన అక్కడున్న ఓటర్ ఆయనను ఆపాడు. దాంతో శివకుమార్ ఓటర్ ని చెంప దెబ్బ కొట్టడంతో ఓటర్ కూడా తిరిగి కొట్టాడు. దాంతో ఎంతో సాపీగా జరుగుతున్న పోలింగ్ కేంద్రంలో శివకుమార్ ఈ విధంగా అలజడి సృష్టించడంతో  ఈసీ సీరియస్ అయిపోయింది. తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. శివ కుమార్ ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ పూర్తయ్యే వరకు ఆయనను గృహా నిర్బంధం చేయాలని  ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేసేసారు.దీంతో తెనాలిలో ఉధృక్త వాతావరణం నెలకొన్నది.  అక్కడ భారీగా పోలీసులు కూడా మొహరించారు. శివకుమార్ వ్యవహార శైలిపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  లైన్ లో నిలబడి రమ్మన్నందుకు అంతలా రౌడీయిజం చేస్తారా..

ఎమ్మెల్యే అయితే ఏంటి అంటూ  ప్రశ్నిస్తున్నారు. శివకుమార్ సామాన్య వ్యక్తిపై దాడి చేసిన వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన నెటిజెన్లు కూడా  ఈ ప్రజాస్వామ్యంలో ఓటు వేసేటప్పుడు క్యూ లైన్ లో వెళ్లాలనే నిబంధన ఉంది. ఆ నిబంధన ఎమ్మెల్యేకు కనిపించడం లేదా..ఎమ్మెల్యే అయితే ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారా .  ఈయనపై చర్యలు తీసుకోవాలని విపరీతంగా నెటిజన్స్ కామెంట్లు పెట్టడంతో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గృహా నిర్బంధం  చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: