లోకేశ్ కు రెడ్ బుక్ వైసీపీకి బ్లూ బుక్.. ఎవరు సీఎం అయినా వాళ్లు బుక్కైనట్లే?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా బుక్కుల రాజకీయాలు జరుగుతున్నాయి. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా లోకేశ్ ఇప్పటికే రెడ్ బుక్ పేరు ప్రస్తావిస్తూ పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ సైతం ఈ విషయంలో మాత్రం లోకేశ్ ను ఫాలో అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఎవరు సీఎం అయినా కొంతమంది మాత్రం బుక్కైనట్లేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారుల పేర్లను రెడ్ బుక్ లో రాశానని లోకేశ్ చెబుతుండగా లోకేశ్ రాసుకున్న జాబితాలో ఒక ఐపీఎస్ అధికారి, కొంతమంది పోలీసులు, ఎస్పీలు కూడా ఉన్నారు. వైసీపీ నేతల పేర్లు సైతం రెడ్ బుక్ లో నోటు చేసుకున్నట్టు ఆయన పలు సందర్భాల్లో వెల్లడించగా లోకేశ్ చేసిన కామెంట్లపై కొన్ని సందర్భాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
వైసీపీ సైతం రాష్ట్రంలో తమకు కొన్ని విషయాలకు సంబంధించి అన్యాయం జరుగుతోందని భావిస్తోంది. అలాంటి అధికారుల పేర్లను వైసీపీ బ్లూ బుక్ లో నోట్ చేసుకుంటోందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం తమ విషయంలో కఠినంగా వ్యవహరించిన వాళ్ల లెక్కలు తేలుస్తామని కొంతమంది వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారని తెలుస్తోంది.
 
బ్లూ బుక్ అని వైసీపీ నేతలు ఎక్కడా చెప్పకపోయినా అభిమానులు మాత్రం టీడీపీ రెడ్ బుక్ అని చెబుతోంది కాబట్టి వైసీపీ బ్లూ బుక్ ఫాలో కావాలని సూచనలు చేస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే తమ పరిస్థితి ఏంటో అని కొంతమంది అధికారులు ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్నారని సమాచారం అందుతోంది. ఏపీ పాలిటిక్స్ ఏ పార్టీని ముంచుతాయో ఏ పార్టీకి మేలు చేస్తాయో చూడాల్సి ఉంది. ఏపీ ఎన్నికల ఫలితాల కోసం ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: