మంత్రి కోమటిరెడ్డికి మైండ్ లేదు..హరీష్ రావు షాకింగ్ కామెంట్స్.!

Pandrala Sravanthi
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీలో హరీష్ రావు ఒక్కడే మంత్రులందరిని విమర్శిస్తూ  ప్రభుత్వ పాలనపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదే తరుణంలో ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు మాటలకు కౌంటర్ ఇస్తూ నువ్వా నేనా అంటూ మాటలు యుద్ధం నడిపిస్తున్నారు. వాడి వేడిగా సాగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల చర్చ చాలా ఆసక్తికరంగా మారింది. ఈరోజు జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల చర్చలో హరీష్ రావు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై  విమర్శలు చేశారు.  కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంత మాటల గారడి అని అన్నారు. దీనిపై వెంటనే స్పందించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  మీరు అప్పట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడతారని మేము ఎదురు చూసామని, కానీ మీరు ఈ బడ్జెట్ గురించి మాట్లాడడం అలా ఆశ్చర్యం వేస్తోందని అన్నారు. 

ఇది పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ అని తెలియజేశారు.  అలాగే హరీష్ రావు కేంద్ర బడ్జెట్ పై తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడతారని అనుకున్నాం. అది మాట్లాడకుండా డైరెక్ట్ గా ప్రజల కోసం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ బడ్జెట్ పై మాట్లాడటం దారుణమని కౌంటర్ ఇచ్చారు.  వెంటనే అందుకున్న హరీష్ రావు కోమటిరెడ్డి హాఫ్ నాలెడ్జి తో మాట్లాడుతున్నావు.బట్టి గారి అంకెల గారడి నీకు అర్థం అయినట్టు లేదు  అన్నారు.  వెంటనే మరోసారి రియాక్ట్ అయిన కోమటిరెడ్డి హరీష్ రావుకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదని, కేసీఆర్ హయాంలో నువ్వు ఒక డమ్మీ మంత్రి అంటూ ద్వజమెత్తారు. బడ్జెట్ పై చర్చించకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నావని అన్నారు. 

మీ కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు,దళితుడిని సీఎం చేస్తానని అన్నారు చేశారా అని ప్రశ్నించారు.

 ఇక కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మరోసారి కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. 50 కోట్లు ఖర్చుపెట్టి ఈ ముఖ్యమంత్రి పిసిసి పదవి కొనుక్కున్నాడని మీరు అన్నారా లేదా అంటూ కోమటిరెడ్డిని ప్రశ్నించాడు. సచివాలయాలను  జిల్లా కలెక్టరేట్లను కేసీఆర్ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని, చేతగానమ్మకు మాటలెక్కువ సామెత పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే వర్తిస్తుందని తెలియజేశారు. మీరు ఇస్తానన్నటువంటి మహిళలకు 2500, ₹4,000 పెన్షన్ ఏమయ్యాయని ప్రశ్నించారు.  ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అవ్వడంతో పూర్తిగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని హరీష్ రావు విమర్శించారు. ఈ విధంగా హరీష్ రావు మరియు ఇతర మంత్రుల మధ్య హోరా హోరీగా మాటల యుద్ధం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: