జగన్ ను నమ్మి తీవ్రంగా నష్టపోయిన ఆర్కే.. పాలిటిక్స్ లో జీరో అయ్యారుగా!
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ సమయంలో మాట్లాడుతూ స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖను ఇచ్చానని వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని కామెంట్లు చేశారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి జగన్ మోసం చేశారు. వరుసగా రెండుసార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు.
మరోవైపు జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం కూడా మంగళగిరిలో ఆర్కే ఇమేజ్ ను దెబ్బ తీసింది. వైసీపీకి గుడ్ బై చెప్పి కొంతకాలం పాటు కాంగ్రెస్ లో ఉన్న ఆర్కే ఆ పార్టీలో ఇమడలేక మళ్లీ వైసీపీలో చేరారు. అయితే ఆర్కే పార్టీల మార్పు విషయంలో సైతం సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆర్కే ఇప్పుడు పాలిటిక్స్ లో జీరో అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మంగళగిరి నియోజకవర్గానికి ప్రస్తుతం నారా లోకేశ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆర్కే పొలిటికల్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది. ఆర్కే పాలిటిక్స్ లో మరింత ఎదగాలని భావించే వాళ్లు సైతంఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం నారా లోకేశ్ భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి ఊహించని స్థాయిలో జరిగితే రాబోయే రోజుల్లో సైతం ఈ నియోజకవర్గంలో నారా లోకేశ్ కు తిరుగుండదని చెప్పవచ్చు. నారా లోకేశ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.