వైసీపీ ఓడితే జగన్ ప్లానేంటి.. ఈ ప్రశ్నలకు వైసీపీ అభిమానుల రియాక్షన్ ఇదే!

Reddy P Rajasekhar
ఏపీలో వైసీపీ గెలుస్తుందని వైసీపీ అభిమానుల్లో పూర్తిస్థాయిలో క్లారిటీ ఉంది. కనీసం దారుణమైన పరిస్థితులలో బొటాబొటీ మెజారిటీతో అయినా వైసీపీకి విజయం దక్కుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే వైసీపీ ఓడితే జగన్ ప్లానేంటి అనే ప్రశ్నకు జగన్ కు ప్రతిపక్షం కొత్త కాదని ప్రజల తీర్పు ఏదైనా ఆయన కట్టుబడి ఉంటారని వైసీపీ అభిమానులు చెబుతుండటం గమనార్హం.
 
అమలు కాని హామీలను ప్రకటించి గెలవడం కంటే సాధ్యమయ్యే హామీలను ప్రకటించి ఓడిపోయినా పరవాలేదని జగన్ భావించారని తెలుస్తోంది. జగన్ మొండోడు అని ఆయన నిర్ణయాలు ఎప్పటికీ మారవని గత ఐదేళ్లలో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల మంచి కోసమే తీసుకున్నారని ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని హామీలను అమలు చేయలేకపోయి ఉండవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
 
99.99 శాతం వైసీపీ ఓడిపోయే అవకాశాలు అయితే లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రజలకు జగన్ ఎప్పుడూ అండగా ఉంటారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించి జగన్ చరిత్ర సృష్టించారని ఈ ఎన్నికల్లో సైతం మ్యాజిక్ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ఏపీలో వైసీపీ గెలిచినా ఓడినా బీజేపీ సపోర్ట్ వైసీపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సపోర్ట్ ఉంటుందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ ను మాత్రం తక్కువగా అంచనా వేస్తే ఏం జరుగుతుందో ఇప్పటికే పలు ఎన్నికల్లో ప్రూవ్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ ప్రణాళికలు ఎప్పుడూ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఆయన వ్యూహాలు వ్యూహకర్తలకు సైతం సులువుగా అందవని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలే జగన్ ను మళ్లీ సీఎం చేయనున్నాయని ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని పచ్చ మీడియా ఛానెళ్లకు సైతం షాకిచ్చేలా ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి ప్లస్ అవుతాయో ఏ రాజకీయ పార్టీకి మైనస్ అవుతాయో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: