ఏపీ : మారిన నెల్లూరు లెక్క.. ఆ పార్టీకి ఓటమి తప్పదా..?

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి పోలింగ్ భారీగా జరిగింది. ఎన్నడూ లేనంతగా ఈ సారి భారీగా యువత ఎన్నికలలో పాల్గొనింది. ప్రస్తుతం రాష్ట్రమంతా ఫలితాల గురించి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. అయితే ఏపీలో ఈ సారి హోరా హోరీ పోరు తప్పదని తెలుస్తుంది..అందులో నెల్లూరు ఎంపీ స్థానంలో ఫలితం పైన ప్రజల్లో భిన్నఅభిప్రాయాలూ వెలువడుతున్నాయి.నెల్లూరు ఎంపీ స్థానం గెలుపు పై ఇరు పార్టీలు ఎంతో ధీమాగా వున్నాయి.. ఇప్పుడు నెల్లూరు ఎంపీ స్థానం గెలుపు రెండు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. చివరి నిమిషం వరకు ఇరు పార్టీల అభ్యర్థులు హోరా హోరీగా ప్రచారం చేసారు.కానీ, ఎన్నికల సరళి మాత్రం గెలుపు ఎవరిదో స్పష్టం చేస్తోంది.నెల్లూరులో ఎన్నికల ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్దిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేసారు. దీంతో వైసీపీ ఎంపీ అభ్యర్దిగా విజయ్ సాయిరెడ్డిని బరిలోకి దించారు. ఆర్థికంగా ఎంతో బలవంతుడు అయిన వేమిరెడ్డి పైన వైసీపీలో కీలకంగా ఉన్న సాయిరెడ్డి పోటీ చేయటంతో నెల్లూరు రాజకీయం వేడెక్కింది.. ఇద్దరు నేతలు కూడా ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం చేసారు.ఇరువురు వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎన్నికల్లో పోటీ పడ్డారు. అయితే వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా ఆ పార్టీకి కంచుకోటగా నిలిచింది.అయితే ఈ సారి వేమిరెడ్డి టీడీపీ తరుపున పోటీ చేయడం ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి కోవూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయటంతో పోరు ఎంతో ఆసక్తిగా మారింది. ఈ సారి గెలుపు తమదంటే తమది అంటూ ఇరు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.రాష్ట్రంలో వైసీపీ కి అనుకూలంగా సర్వేలు రావడంతో ఈ సారి కూడా నెల్లూరును వైసీపీ కైవసం చేసుకుంటుందని ఇంటర్నల్ గా టాక్ వినిపిస్తుంది. అయితే టీడీపీ మాత్రం బాగా పోటీని ఇస్తుందని సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: