సీన్ రిపీట్.. గెలుపు పక్కా.. మళ్ళీ కిషనన్నే ఎంపీ?

praveen
నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది. మొన్నటి వరకు ప్రచార నిర్వహించి హామీల వర్షం కురిపించిన అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు తెలంగాణ ఓటర్లు అందరూ కూడా సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు ఇప్పటికే బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా నేడు పోలింగ్ జరుగుతూ ఉండగా.  ఇప్పటినుంచి ఈ గెలుపు ఎవరిది అనే విషయంపై ఎన్నో ఊహాగానాలు తెరమీదికి వస్తూ ఉన్నాయి.

 ఆయా పార్లమెంట్ స్థానాలలో ఉన్న రాజకీయ సమీకరణలకు అనుగుణంగా గెలుపు ఎవరిది అనే విషయంపై కొంతమంది రాజకీయ విశ్లేషకులు ముందే అంచనా వేసేస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈసారి ఎవరు గెలవబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు పార్లమెంట్ ఎన్నికలు జరగగా.. ఈ రెండు సార్లు కూడా అక్కడ కాషాయ జండా ఎగురుతూ వచ్చింది. రెండుసార్లు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు కిషన్ రెడ్డి. ఇప్పుడు మూడోసారి కూడా బిజెపి నుండి బరిలో నిలిచారు.

 సాధారణంగా అయితే ఆ పార్లమెంట్ సెగ్మెంట్లోని నియోజకవర్గాలలో ఏ పార్టీ అయితే ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలను కలిగి ఉంటుందో ఇక వారికే బలం ఎక్కువగా ఉంటుందని.. వారే విజయం సాధిస్తారని అందరూ అనుకుంటారు. కానీ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని అన్ని నియోజకవర్గాలలో కూడా బిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి ప్రజలందరూ బిజెపి వైఫై నిలబడ్డారు. ఇక ఇప్పుడు కూడా బిఆర్ఎస్ ఇదే రీతిలో ఏడు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. దీంతో మరోసారి అటు కిషన్ రెడ్డిదే విజయం అని.. పాత సెంటిమెంట్లు కూడా చెబుతున్నాయి.

 మరోవైపు కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ బిఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు. అయితే కిషన్ రెడ్డికి ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఫాలోయింగ్ ముందు ఇక ఇద్దరూ బలమైన ప్రత్యర్థులు కాదనే వాదన కూడా  ఉంది. ఇంకోవైపు  కేంద్రంలో ఎలాగో మోడీని వస్తారు కాబట్టి కిషన్ రెడ్డిని గెలిపిస్తేనే మరోసారి కేంద్రమంత్రి పదవి చేపట్టి ఇక పార్లమెంట్ లోని అన్ని నియోజకవర్గాలకు ఏదో ఒకటి చేస్తారని ప్రజలు నమ్ముతున్నారట. అందుకే పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన ఓటర్లందరూ పువ్వు గుర్తుపైన గుద్దేస్తున్నారట. సికింద్రాబాద్లో మరోసారి ఎంపీ అయ్యేది కిషన్ రెడ్డి అని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: