వైసీపీ ఎమ్మెల్యేలపై ఈసీ అధికారుల చర్యలు రైటే.. మరి వాళ్ల సంగతేంటి?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అధికారులకే సర్వాధికారులు ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ ఒక ఓటర్ చెంప పగలగొట్టగా ఎన్నికల కమిషన్ శివకుమార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు శివకుమార్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు శివకుమార్ ను గృహ నిర్భంధంలో ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
 
ఓటర్ అసభ్యకరంగా మాట్లాడటం వల్లే తాను అలా చేయాల్సి వచ్చిందని అంతకు మించి తాను ఓటర్ చెంప చెల్లుమనిపించడం వెనుక మరే కారణం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తాడిపత్రిలో పోలీసులపైనా రాళ్ళదాడులు, వాహనాల ధ్వంసం జరిగిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సూచనలతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
 
ఎన్నికల కమిషన్ ఈ నేతల విషయంలో వ్యవహరించిన తీరును ఎవరూ తప్పుబట్టరు. అయితే కొన్ని ప్రాంతాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు దాడులు చేస్తున్నారని టీడీపీ నేతల దౌర్జన్యాల వల్ల ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని సమాచారం అందుతోంది. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.
 
కర్రలు, రాడ్లు, మారణాయుధాలతో వాళ్లు దాడి చేశారని తెలుస్తోంది. తలలు పగలడంతో వైసీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు కాగా పిన్నెల్లి వాహన్ శ్రేణి పూర్తిగా ధ్వంసం అయిందని భోగట్టా. పెనమలూరులో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభపెడుతుండగా ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ రూల్స్ కు విరుద్ధంగా 10 కాన్వాయ్ లతో హల్చల్ చేశారు. బాపట్లలో వైసీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ పై కూడా దాడి జరిగింది. కాకినాడలో వైసీపీ నేతలపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. దర్శి నియోజకవర్గంలో టీడీపీ నేతల ప్రవర్తన వల్ల ఒక ఈవీఎం కింద పడింది. ఈ ఘటనలపై కూడా ఈసీ ఫోకస్ పెట్టి తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: