గుర్తులు మార్చి మరి పోటీపడుతున్న రీచ్ రెడ్డిస్..!

Divya
హైదరాబాద్ నగరానికి కొంత దూరంలో చేవేళ్ల కేంద్రంగా ఉన్న లోక్సభ నియోజకవర్గంలో.. అక్కడ రెడ్డి సామాజిక వర్గం మధ్య ఎన్నికల పోరు కొనసాగుతూనే ఉంది.. ఒకరేమో బాగా రిచ్ పర్సన్ మరొకరేమో సామాన్యుడిగా జన్మించిన వ్యక్తి ఒకరేమో ఆస్తులు వేలకోట్లలో చూపిస్తే.. మరొకరి ఆస్తులు వందల కోట్లలో చూపిస్తున్నారు. ఎలా చూసిన అక్కడ రెడ్డీస్ మధ్య లోక్సభ నియోజకవర్గంలో పోరు అయితే కొనసాగుతూ ఉంది. వీరిద్దరూ గత ఎన్నికలలో పోరాడిన నాయకులే అయితే ఈసారి గుర్తులు మార్చుకొని మరి పోరాడుతున్నారు..

వారు ఎవరో కాదు కొండ విశ్వేశ్వర్ రెడ్డి.. జి రంజిత్ రెడ్డి.. గత ఎన్నికలలో విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగా రంజిత్ రెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీపడ్డారు.. విశ్వేశ్వర్ రెడ్డి పై రంజిత్ రెడ్డి స్వల్ప మెజారిటీతోనే గతంలో గెలిచారు.. అప్పుడు కేవలం 14 వేల మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికలలో విశ్వేశ్వర్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంటే.. రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్నారు. అలా ఇద్దరు కూడా గుర్తులు మార్చుకొని ఈసారి మళ్లీ పోరాడుతూ ఉన్నారు.

గత ఎన్నికలలో బిజెపి పార్టీ నుంచి లోక్సభ సీటుకు జనార్దన్ రెడ్డి పోటీ చేసి రెండు లక్షల ఓట్లను గెలిచారు. ఇప్పుడు విశ్వేశ్వర్ రెడ్డి వీటిని ఏ స్థాయి వరకు తీసుకువెళ్తారు అంటూ ఆసక్తికరంగా చూస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబం ఆస్తులు రూ .4500 కోట్లకు పై మాటే నట.. తన వ్యక్తిగత ఆస్తి రూ .1200 కోట్లకు పైగా ఉన్నాయని డిక్లేర్ చేశారు. అపోలో హాస్పిటల్ జాయింట్ MD తన భార్య సంగీత రెడ్డి పేరు మీద రూ .3,208 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు తెలియజేశారు.

ఇక రంజిత్ రెడ్డి పౌల్ట్రీ వ్యాపారంతో స్వతాగ ఎదిగిన వ్యక్తి ఆయన ఎన్నికలలో డిక్లర్ చేసిన ఆస్తి విలువ 445 కోట్లు..ఇందులో 250 కోట్ల రూపాయలు ఆయన పేరిట ఉన్నాయని తెలిపారు. తన భార్య పేరు మీద 179 కోట్ల రూపాయలు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తానికి చేవెళ్ల నియోజవర్గంలో ఈ ఇద్దరు సూపర్ రెడ్డి లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: