చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురైన వరలక్ష్మి శరత్ కుమార్..!?

Anilkumar
నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది వరలక్ష్మి శరత్ కుమార్. హీరోయిన్ గానే కాకుండా లేడీ విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఒకవైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరొకవైపు హీరోయిన్గా లీడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. ఇక ఇటీవల ఈమె బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ సినిమాలో సైతం సిస్టర్ పాత్రలో నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే .

అయితే తాజాగా ఇప్పుడు శబరి అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహర్షి కండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్ర నాథ్ నిర్మిస్తున్న ఈ సినిమా అనిల్ కట్జ్ దర్శకత్వంలో వస్తోంది. కాగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్న ఈ సినిమా ఈనెల 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్ర మోషన్స్ లో భాగంగా ప్రస్తుతం బిజీగా ఉంది వరలక్ష్మి శరత్ కుమార్. అయితే ఇటీవల ఆమె ఎంగేజ్మెంట్ సైతం చేసుకున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతోంది ఈ నటి.

 ఈ సందర్భంగా వరలక్ష్మీ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇలాంటి ఇంతకు ముందు నేను చెయ్యలేదు. ఈ లో నేను మదర్ గా నటిస్తున్నా.. ఈ లో ఓ తల్లి కూతుర్ని ఎలా కాపాడుకుంది అనేది ఈ కథాంశం.. సైకాలజికల్ థ్రిల్లర్‌గా మార్చే సన్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయి అని చెప్పుకొచ్చింది వరలక్ష్మీ. నేను చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను. అది నా జీవితంలోనే మర్చిపోలేని గాయం. చాలా మంది ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చాలా మంది సన్నిహితులకు, బందువులకు చెప్పకుండా దాచేస్తున్నారు. ఈరోజుల్లో ప్రతీ ఒక్కరికి థెరపిస్ట్ ఉంటే బాగుంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: