డిసెంబర్ 7: పాలిటిక్స్ వర్సెస్ టాలీవుడ్.. ఇంట్రస్టింగ్ వార్

Chakravarthi Kalyan

డిసెంబర్ 7.. తెలంగాణలో రాజకీయ నేతలంతా ఆసక్తిగా ఎదురు చూసే రోజు. అవును మరి ఆరోజే తెలంగాణ అంతటా పోలింగ్ జరగబోతోంది. మరి రాజకీయ నేతలతో టాలీవుడ్ పోరాటం ఎందుకంటారా.. అవును మరి.. డిసెంబర్ 7 శుక్రవారం.. అయితే ఏంటి అంటారా.. శుక్రవారం రోజు సినిమాల విడుదలవుతుండటం సాధారణమే.


కానీ డిసెంబర్ 7న ఏకంగా ఏడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. సో.. ఓవైపు పోలింగ్ బూత్ లు ఓటర్లతో కళకళలాడుతుంటే.. సినిమా థియేటర్లు కొత్త సినిమాలతో సందడి చేయబోతున్నాయన్నమాట. ఎలాగూ పోలింగ్ రోజు కాబట్టి సెలవు ఉంటుంది. ఆ తర్వాత శని, ఆది వారాలు ఎలాగూ వీకెండ్. అందుకే చాలామంది నిర్మాతలు తమ సినిమాల విడుదలకు డిసెంబర్ 7 ను ఎంచుకున్నారు.


మరి డిసెంబర్ ఏడున విడుదల కాబోతున్న సినిమాలేంటో చూద్దామా.. వీటిలో రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న భైరవగీత ఒకటి. ఆ తర్వాత బెల్లంకొడ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న కవచం చిత్రం కూడా డిసెంబర్ 7 నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో కాజల్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా ఉన్నారు. ట్రైలర్, పాటలకు మంచి టాక్ రావడంతో ఈ సినిమాపైనా మంచి అంచనాలే ఉన్నాయి.


తమన్నా, సందీప్ కిషన్ నటిస్తున్న నెక్స్ట్ ఏంటి సినిమా కూడా డిసెంబర్ 7నే తెరకెక్కనుంది. ఇవే కాకుండా సుమంత్ హీరోగా వస్తున్న ఇదంజగత్ తో పాటు సువర్ణ సందరి, హుషారు, శుభలేఖ+లు, బ్లఫ్ మాస్టర్ వంటి సినిమాలు కూడా డిసెంబర్ 7 నే విడుదలవుతున్నాయి. ఐతే.. ఓటేయడానికి గంట, రెండు గంటలకు మించి సమయం పట్టే అవకాశం ఉండదు కాబట్టి.. 8 సినిమాల విడుదల ప్రభావం పోలింగ్ పై ఉండదని తెలంగాణ సీఈవో రజత్ కుమార్ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: