షాకింగ్ : ఫేషియల్ చేయించుకుంటే.. మహిళలకు హెచ్ఐవి?

praveen
సాతరణంగా ఆడవాళ్ళకి మేకప్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవుడు ఇచ్చిన అందానికి మరింత మెరుగులు దిద్దుకునేందుకు మేకప్ ని ఉపయోగిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఇంటి నుంచి కాలు బయటపెడుతున్నారు అంటే చాలు ఏకంగా మేకప్ వేసుకోకుండా అస్సలు బయట అడుగు పెట్టరు ఆడవాళ్లు. అందుకే మేకప్ కి ఆడవాళ్ళకి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది అని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో జోక్స్ కూడా పేలుతూ ఉంటాయి అని చెప్పాలి.

 అయితే ఇక ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా బ్యూటీ పార్లర్ల సంఖ్య పెరిగిపోయిన నేపథ్యంలో.. ఇక అక్కడికి వెళ్లి తమకు కావాల్సిన వన్ని చేయించుకుని అందం కోసం వేల రూపాయలు ఖర్చు పెడుతున్న వారు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. అయితే కొంతమంది ఏకంగా తమ అందాన్ని మరింత పెంచుకునేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్జరీలు కూడా చేయించుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా అందంగా మారెందుకు చేయించుకుంటున్న చికిత్సలు వికటించి చివరికి ఉన్న అందం పోగొట్టుకున్న ఘటనలు కూడా అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి.

 ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది ఇలాంటి తరహా ఘటన గురించే. ఎప్పటిలాగానే బ్యూటీ పార్లర్ కు వెళ్లి ఏకంగా ఫేషియల్ చేయించుకున్నారు ముగ్గురు మహిళలు. కానీ చివరికి హెచ్ఐవి బారిన పడ్డారు. ఈ ఘటన న్యూ మెక్సికోలో వెలుగులోకి వచ్చింది. వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలు కూడా హెచ్ఐవి బారిన పడ్డారు. ఈ ఫేషియల్లో ఒక వ్యక్తి చేతి నుంచి రక్తం తీసి అందులో ప్లేట్ లెట్స్ వేరు చేసి ముఖంపై ఇంజక్ట్ చేసారూ   మెక్సికోలోని ఓ పార్లర్ కొందరు మహిళలు ఈ ఫేషియల్ చేయించుకున్నరట. ఇక వారిని పరీక్షించుగా హెచ్ఐవి సోకినట్లు అమెరికాలోని సీడీసీ తెలిపింది. అయితే ముఖం యవ్వనంగా కనిపించేందుకు ఇలాంటి తరహా ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Hiv

సంబంధిత వార్తలు: