రాయలసీమ: ఓటింగ్ రోజు కూడా కూటమిలో విభేదాలు.. ఏకంగా ఈవీఎంలు ధ్వంసం..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు నియోజవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా పుల్లంపేట మండలం దళావాయిపల్లిలో ఏకంగా జనసేన ఏజెంట్ ని రాజారెడ్డి కిడ్నాప్ చేశారనే విషయం అక్కడ ఒక కలకలాన్ని సృష్టిస్తోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న అక్కడి గ్రామస్తులు ఆగ్రహంతో నిరసనలు తెలియజేస్తూ.. ఈవీఎంలను కూడా పగలగొట్టినట్లు తెలుస్తోంది.. 192 పోలింగ్ బూతులో పోలింగ్ ఒక్కసారిగా  ఆగిపోయినట్టు సమాచారం. అక్కడ ఎన్నికలను పునరుద్దించడానికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.కొత్త ఈవీఎంలను తరలించినట్లు సమాచారం. గతంలో కూడా పొత్తులలో భాగంగా ఎక్కువగా విభేదాలు తలెత్తాయి. కానీ ఇప్పుడు ఓటింగ్ జరుగుతున్న సమయంలో కూడా ఇలాంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి.

పోలింగ్ కేంద్రం వద్ద బిజెపి ,జనసేన ,టిడిపి నేతలు మధ్య చివరికి ఎలక్షన్స్ సమయంలో కూడా వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి.జనసేన ఏజెంట్లు లేకుండా ఎలా పోలింగ్  నిర్వహిస్తారు అంటూ అక్కడి నేతలతో కూటమి నేతలు చాలా వాగ్వాదానికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అడిషనల్ ఎస్పీ సందర్శించి అవాంఛిత సంఘటనలు జరగకుండా బలగాలను సైతం అక్కడ ఉంచారు. అలాగే కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత మరింత ఎక్కువయింది. జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గ ఎన్నికలు అధికారి చంద్రమోహన్ మాట్లాడుతూ..

చాపాడు మండలం చిన్నగురువలూరు పోలింగ్ స్టేషన్లో ఈరోజు ఉదయం టిడిపి ఏజెంట్ల పైన దాడి జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు ఎలాంటి అవాంచిత సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఓటర్లు ప్రతి ఒక్కరు తమ ఓటుని చాలా ప్రశాంతంగా వినియోగించుకోవాలని పోలింగ్కు ఎలాంటి ఆటంకాలు సృష్టించకూడదని ఒకవేళ అలా చేస్తే కేసులు నమోదు అయితే చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఓటింగ్ కూడా భారీగానే ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లు తెలుస్తోంది.. మరి ప్రజలు ఎవరిని సీఎంగా ఎంచుకుంటారో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: