కల్కి మూవీ కర్ణాటక గడ్డపై.. రచ్చ..!

Divya
డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి.. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపుగా మూడు గంటల పాటు ఉన్న ఈ సినిమా ఒకవైపు ప్రమోషన్స్ లో పాల్గొంటూనే మరొకవైపు థియేట్రికల్ బిజినెస్ లో దూసుకుపోతోంది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కర్ణాటక బిజినెస్ కూడా క్లోజ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి పూర్తి విషయాలు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా దాదాపుగా రూ.160 కోట్లకు వరకు బిజినెస్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అలాగే హిందీలో రూ.100 కోట్లకు పైగా కర్ణాటక బిజినెస్ విషయానికి వస్తే రూ .25 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. తమిళంలో కూడా ఈ సినిమాకు భారీగానే బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలు కమలహాసన్ నటించడం కూడా ఈ సినిమా పైన భారీగానే హైప్స్ క్రియేట్ అయ్యాయి. తమిళనాడులో రూ .20 కోట్లకు వరకు బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. మొత్తం మీద చూసుకుంటే 340 కోట్ల రూపాయల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

కల్కి సినిమా కోసం ప్రభాస్ దాదాపుగా రెండేళ్లకు పైగా డేట్లను కేటాయించారు. కల్కి సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనె,దిశా పటాని వంటి వారు నటిస్తూ ఉన్నారు. దీంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడింది. అలాగే అమితాబ్ బచ్చన్ నటిస్తూ ఉన్నారు . గత ఏడాది సలార్ సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు మరొకసారి ప్రేక్షకులను కల్కి 2898AD సినిమాతో ఈ నెల 27న రాబోతున్నారు. కల్కి సినిమా అయిపోయిన వెంటనే సలార్-2 సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు.అలాగే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమాలో కూడా నటిస్తూ ఉన్నారు. ఇవే కాకుండా స్పిరిట్ సినిమాలో కూడా నటించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: