బ్లాక్ బస్టర్ హార్రర్ సీక్వెల్ 'కాంచన 4' వచ్చేస్తుంది..!!

murali krishna
ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్, టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.ముఖ్యంగా హారర్ మూవీస్‌తో సినీ ప్రేక్షకుల్ని భయపెట్టేస్తుంటాడు. లారెన్స్ తీసిన సినిమాల్లో ఎక్కువగా హారర్ సినిమాలే. ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి హిట్లను అందుకున్నాడు. అందులో 'కాంచన' ఒకటి.సౌత్ సినీ ఇండస్ట్రీ  లో హారర్ సినిమాలకి ట్రెండ్ సెట్ చేసిన ‘కాంచన’ సిరీస్ నుంచి మరో మూవీ రాబోతుందిడ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్ కం హీరో రా రాఘవ లారెన్స్ నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి ముని, కాంచన, గంగ(కాంచన 2), కాంచన 3 వంటి సినిమాలు ఆడియన్స్ ని బాగా భయపెట్టాయి. ఇక ఇప్పుడు కాంచన 4 కూడా రాబోతుంది.‘కాంచన 3’ మూవీ 2019 ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటినుంచి పార్ట్-4 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాంచన 3 క్లైమాక్స్ లో పార్ట్-4 కి సంబంధించి రాఘవ లారెన్స్ లుక్ రివీల్ చేయడంతో ఆ లుక్ కాస్త పార్ట్-4 పై మరింత ఆసక్తి పెంచింది. ఇక ఎట్టకేలకు ‘కాంచన 4’ పట్టాలెక్కనుంది.ఇందుకు సంబంధించి మేకర్స్ తాజాగా అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. రాఘవ లారెన్స్స్వీ య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. దాంతో పాటూ 2025 సమ్మర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇక ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.రాఘవ లారెన్స్ సినిమాల విషయంలో ఎంత నిజాయితీగా ఉంటారో అంతే నిజాయితీగా తన ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఎదుటివారిని సహాయం చేసే వ్యక్తిత్వం ఉన్న మనిషి. తను చేసే మంచితనమే తన సినిమాలను ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడుతూ ఉంటుంది. ఇప్పుడు కాంచన ఫోర్ కూడా అలాంటి గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుందాము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: