మాస్క్ వెనుక అందాలు దాచిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..??

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీసెంట్గా తన అందం అభినయంతో అందరిని ఆటుకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందాం.సాధారణంగా సోషల్ మీడియాలో సెలబ్రెటీలు చాలా చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నిత్యం తమ అప్డేట్స్, లేదా క్రేజీ ఫోటోషూట్స్, డాన్స్ వీడియోస్ షేర్ చేస్తుంటారు.కానీ ఈ మధ్య మాత్రం ఎక్కువగా తమ త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేస్తున్నారు పలువురు హీరోయిన్స్. చిన్నప్పటి ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ మాత్రం తన ఇన్ స్టాలో కొన్ని త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసింది. కెమెరా ఉంటే చాలు ఫోటో దిగేందుకు రెడీగా ఉంటా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. పైన ఫోటోను చూశారు కదా.. ముసుగు మాటున దాగిన అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ? టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటివరకు వరుసగా హిట్స్ అందుకుంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుంది. అంతేకాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రశంసలు కూడా అందుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? ఇటీవలే సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ మీనాక్షి చౌదరి.
ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన తారలలో మీనాక్షి ఒకరు. ట్రెడిషనల్ , వెస్ట్రన్ ఇలా లుక్ ఏదైనా కుర్రాళ్ల హృదయాలను కట్టిపడేస్తుంది. ల కన్నా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో ఎక్కువగా అభిమానులను సంపాదించుకుంటుంది. మీనాక్షి చౌదరి.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మిస్ ఇండియా హార్యానా టైటిల్ గెలుచుకున్న ఈ బ్యూటీ.. మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2019లో అప్ స్టార్ట్స్ అనే హిందీ తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఆశించిన స్థాయిలో అక్కడ గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.ఆ తర్వాత సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు తో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి తోనే అందం, అభినయంతో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఈ తర్వాత చాలా కాలం సైలెంట్ అయిన ఈ బ్యూటీ.. మాస్ మాహారాజా రవితేజ నటించిన ఖిలాడీ చిత్రంలో నటించింది. అలాగే అడివి శేష్ నటించిన హిట్ 2 మూవీతో సక్సెస్ అందుకుంది. ఈ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం లో కనిపించింది. ఇందులో మహేష్ మరదలు పాత్రలో కనిపించి మరోసారి ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ హల్చల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: