గెలుపు ఖాయం.. బిజెపి బోణి కొట్టేది.. రాజేంద్రుడితోనేనా?

praveen
మినీ ఇండియా గా పిలుచుకునే మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈసారి విజయం ఎవరిది  మొదటి నుంచి ఇదే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని బిజెపి గడ్డి పట్టుదలతో ఉంటాయి. ఈ క్రమంలోనే హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను ఇక్కడి నుంచి బరిలోకి దింపింది. అయితే అటు సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో కాంగ్రెస్ కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

 బిఆర్ఎస్ తరఫున రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ తరపున పట్నం సునీత మహేందర్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమని ఇప్పటికే అన్ని రకాల సర్వేలు చెప్పాయి. ఎందుకంటే గత పదేళ్లుగా మల్కాజిగిరిలో అభివృద్ధి అంతంత మాత్రమే. సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న మల్కాజ్గిరి కి చేసింది కూడా ఏమీ లేదు. ఈ క్రమంలోనే సత్తా ఉన్న నేత కోసం అక్కడి ప్రజలు వెతికారు. ఇంతలోనే గతంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా గతంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం.. ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వడం.. ప్రజల సమస్యలపై గలమెత్తడం విషయంలో తన సత్తా ఏంటో ఇప్పటికే నిరూపించిన ఈటేల రాజేందర్ వైపు ఇక మల్కాజిగిరి ఓటర్లు అందరూ కూడా ఆకర్షితులు అయ్యారు అని తెలుస్తుంది.

 ఇక మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మార్చి ప్రారంభంలోనే  నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించగా.. ఈరోజు షో ఓటర్లందరిలో మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇక ఈ రోడ్ షో కి వచ్చిన స్పందనతోనే ఈటెల గెలుపు ఖాయం అయిపోయింది అని ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. అయితే మల్కాజ్గిరిలో రైల్వే, మిలిటరీ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడి పరిష్కరించగల గొంతు కోసం అక్కడి ఓటరు ఎదురుచూశారు. ఇది కేంద్ర ప్రభుత్వం మాత్రమే పరిష్కరించగల సమస్య. అందుకే ఈటలను గెలిపించి కేంద్ర ప్రభుత్వం లో భాగం చేస్తే ఈ సమస్యలను ఎంతో సులభంగా  పరిష్కరించుకోవచ్చని అనుకుంటున్నారట మల్కాజ్గిరి ఓటర్లు. దీంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిన ఓటర్లందరూ పువ్వు గుర్తుపైన గుద్దేందుకు రెడీ అయ్యారట. దీంతో తెలంగాణలో బిజెపి బోణి కొట్టేది ఈటెల రాజేందర్ తోనే అని పార్టీ శ్రేణులు కూడా బలంగా నమ్ముతున్నారు. అయితే ఇప్పటికే పీపుల్స్ పల్స్ సర్వే, 26 స్ట్రాటజీస్ సర్వే కూడా మల్కాజ్గిరిలో 46.79 ఓటింగ్ శాతం ఈటెలకే వస్తుందని తేల్చాయి. ఇక ఈ సమీకరణాలన్నీ చూసుకుంటే మల్కాజ్గిరి ఈసారి రాజేంద్రుడిదే అంటూ పోలింగ్ రోజే ఊహాగానాలు తెరమీదకి వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: