బురఖాలో వచ్చిన మహిళలను అవమానించిన మాధవి లత.. పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్డ్‌?

Suma Kallamadi
భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లత లోక్‌సభ ఎన్నికల ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఈరోజు హైదరాబాద్‌లోని ఓ పోలింగ్ బూత్‌ వద్దకు వెళ్లి బురఖాలో వచ్చిన మహిళలకు ఇబ్బంది కలిగించారు. పోలింగ్ స్టేషన్ లో కూర్చున్న ఆ మహిళల వద్దకు వెళ్లి "ఏది నీ ఆధార్ కార్డు చూపించు? మీ ఓటర్ స్లిప్ చూపించు?" అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, ఫేస్ చూపించు ఇది నువ్వేనా అంటూ చెక్ చేశారు. ఇలా గుర్తింపు కార్డులను చెక్ చేసే అనుమతి ఆమెకు ఎక్కడిది? ఆమె పోలింగ్ స్టేషన్‌లోకి వచ్చి అందరిని చెక్ చేస్తుంటే ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారు? అని చాలామంది మండిపడ్డారు.
 మాధవి లత ఓటర్ల ఐడీ కార్డులు చెక్ చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గాను మారింది. ఈ వ్యవహారం చివరికి పోలీసు అధికారుల దృష్టికి చేరింది. చివరికి మాధవి లతపై మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో చట్టపరమైన ఫిర్యాదు దాఖలైంది. ఆమెపై అనేక చట్టాల ప్రకారం కేసులు ఫైల్ చేశారు. సెక్షన్ 171C (ఎన్నికల సమయంలో తగని ప్రభావం), సెక్షన్ 186 (పబ్లిక్ సర్వెంట్‌ని వారి విధుల్లో అడ్డుకోవడం), సెక్షన్ 505(1) (ఏదైనా వర్గాన్ని ప్రేరేపించే ఉద్దేశం లేదా ప్రేరేపించే అవకాశం, ఏదైనా ఇతర తరగతి లేదా సంఘంపై ఏదైనా నేరం చేసే వ్యక్తుల సంఘం), ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 (ఎన్నికల నేరాలకు సంబంధించినది) కింద ఆమెపై కేసులు నమోదు అయ్యాయి.
అయితే నెటిజన్లు ఆమెను ఈ పోలింగ్ తేదీ పూర్తయ్యేదాకా నిర్బంధించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఓటర్ల పై నెగిటివ్ ఇన్‌ఫ్లుయెన్స్‌ కలిగిస్తారని ఆరోపిస్తున్నారు. మాధవి లత పోలింగ్ కేంద్రం వద్ద మహిళలను అవమానిస్తూ వారిని బాడీ షేమ్ చేస్తున్నారని మరి కొంతమంది ఫైర్ అయ్యారు. ఆమెపై కేసు నమోదు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదని, పోలీసులు తక్షణమే నిర్బంధించాలని మరికొంతమంది డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: