షాకింగ్ పవన్ కఠిన ఉపవాస దీక్ష అభిమానులలో తీవ్ర టెన్షన్ !

Seetha Sailaja
రేపటి నుండి ప్రారంభం కాబోతున్న దేవి నవరాత్రుల సందర్భంగా పవన్ కళ్యాణ్ అమ్మవారి దీక్షను చేపట్టి నవరాత్రులలో తొమ్మిది రోజులు కఠిన ఉపవాస దీక్ష ప్రారంభించబోతున్నట్లు వచ్చిన వార్తలు పవన్ అభిమానులకు టెన్షన్ క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తొమ్మిది రోజులు పవన్ కేవలం పాలు కొబ్బరి నీళ్ళు మాత్రమే తీసుకుంటూ ఒకవైపు ఉపవాస దీక్షను కొనసాగిస్తూనే తన ప్రజా పొటాట యాత్రను కొనసాగించబోతున్నాడు.

దీనికితోడు పవన్ రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పై తన అభిమానులతో కలిసి చేయబోతున్న కవాత్ ప్రదర్శన ద్వారా గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలని పవన్ ‘జనసేన’ భారీ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి భారీ ప్రదర్శనలు చేస్తూ మరొకవైపు కఠిన ఉపవాస దీక్షలో పవన్ రాబోతున్న తొమ్మిది రోజులు నిష్టగా ఉంటే ఇంత శారీరక ఒత్తిడిని పవన్ తట్టుకోగాలడా అన్న టెన్షన్ లో పవన్ వీరాభిమానులు ఉన్నారు. 

ఇది ఇలా ఉండగా పవన్ తన ‘జనసేన’ కు ‘పిడికిలి’ గుర్తు కావాలని ఎన్నికల కమిషన్ కి దరఖాస్తు చేసినా అది ఇంకా ఫైనల్ కాకపోవడం పవన్ అభిమానులకు నిరాశను కలిగిస్తోంది. ‘జనసేన’ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ‘నక్షత్రం’ అయితే పవన్ మటుకు తన పార్టీ ఎన్నిక గుర్తుగా పిడికిలి అడుగుతున్నాడు. ఈ గుర్తు తనకు లభిస్తే జనంలోకి చాల సులువుగా తీసుకు వెళ్లిపోవచ్చు అన్న అభిప్రాయం పవన్ కు ఉంది.

ప్రస్థుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన చేస్తున్న పవన్ తాను ముఖ్యమంత్రి అయితే ఒక్క రూపాయి కూడ జీతంగా తీసుకొను అంటూ ఒకనాడు నందమూరి తారక రామారావు తన తెలుగుదేశం పార్టీ ప్రచారంలో చేసిన ప్రచార ఎత్తుగడను మళ్ళీ పవన్ అనుసరిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ ప్రజాపోరాట యాత్ర చేస్తున్న ఉభయగోదావరి జిల్లాలు పవన్ ‘జనసేన’ భవిష్యత్ కు  అత్యంత కీలకంగా మారాయి. రాబోతున్న ఎన్నికలలో కింగ్ మేకర్ అవ్వాలని కలలు కంటున్న పవన్ కు ఈ ఉభయ గోదావరి జిల్లాలలో వచ్చే స్థానాలను బట్టే పవన్ ‘జనసేన’ భవిష్యత్ ఉంటుంది అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: