అల్లు అర్జున్ కొత్తసినిమాకు గంగోత్రి జ్ఞాపకo !

Seetha Sailaja
అల్లు అర్జున్ 16 సంవత్సరాల క్రితం హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘గంగోత్రి’ మూవీ ఘన విజయం సాధించడంతో మొదటి సినిమాతోనే హిట్ ను అందుకుని తన కెరియర్ కు రాచబాట అప్పట్లోనే వేసుకున్నాడు. ఆతరువాత అనేక ఘనవిజయాలు అందుకోవడంతో యూత్ కు స్టైలిష్ స్టార్ గా మారిపోయిన బన్నీ కెరియర్ ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తరువాత అయోమయంలో పడిపోయింది. 

దీనితో అంతర్మధనంలోకి వెళ్ళిపోయిన బన్నీ తన తదుపరి సినిమా గురించి అనేక ఆలోచనలు చేస్తున్నాడు. దర్శకుడు విక్రమ్ కుమార్ తో చేయాలి అనుకున్న మూవీ ప్రాజెక్ట్ ను ప్రయోగాలకు భయపడి వదులుకున్న నేపధ్యంలో ఇప్పుడు బన్నీ చూపులు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పడ్డాయి. అయితే ‘అరవింద సమేత’ రిజల్ట్ గురించి వెయిట్ చేస్తూ తన నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టిన అల్లు అర్జున్ ఆలోచనలను రచయిత చిన్నికృష్ణ తీవ్రంగా ప్రభావితం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

బన్నీ మొదటి సినిమా ‘గంగోత్రి’ కి చిన్నికృష్ణ అందించిన కథ అప్పట్లో ఘన విజయం ఇవ్వడంతో అల్లు కాంపౌండ్ కు చిన్నికృష్ణ చాల సన్నిహితంగా మారాడు. అల్లు కాంపౌండ్ తో పాటు మెగా కాంపౌండ్ కు కూడ అప్పట్లో చాల సన్నిహితంగా ఉండేవాడు చిన్నికృష్ణ. చిరంజీవికి ‘ఇంద్ర’ లాంటి పవర్ ఫుల్ కథను అందించిన చిన్నికృష్ణ ఆతరువాత కాలంలో అతడి కథలతో తీసిన సినిమాలు ఫెయిల్ అవ్వడంతో పూర్తిగా తన ప్రాభవాన్ని కోల్పోయాడు. 

అయితే ఇంత గ్యాప్ గడిచిన తరువాత ఈ రచయిత తన సర్వశక్తులు ధారపోసి ఒక పవర్ ఫుల్ స్టోరీని బన్నీని దృష్టిలో పెట్టుకుని రాయడం ఆకథ విపరీతంగా అల్లు కాంపౌండ్ కు నచ్చడం జరిగిపోయింది అంటున్నారు. దీనితో ఈకథను సినిమాగా తీయగల దర్శకుడు గురించి అన్వేషణ సాగుతోంది అని టాక్. ఒకవేళ అనుకోకుండా త్రివిక్రమ్ బన్నీల ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కకపోతే చిన్నికృష్ణ కథ బన్నీ గురించి రంగంలోకి దిగే అవకాశం ఉంది అని స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: