కేరళ విలయ బాధితులకు మన నటీనటుల సహకారం అద్భుతం అమోఘం

మనదేశం లో సెలెబ్రిటీలు ప్రకృతి వైపరీత్యాల వేళ అంతా ఐకమత్యంగా తమ విత్రణ శీలతను తమ అభిమానులపై ప్రదర్శిస్తారు. ఏఎ విషయంలో మన సెలబ్రిటీల స్పందన  అమోఘం. తమని అభిమానించే ప్రజలకు కష్టం వస్తే చూస్తూ ఉండ లేరు. ఈ విషయంలో టాలీవుడ్ హీరోలు - కోలీవుడ్ హీరోల ధాతృత్వాన్ని సహృదయాన్ని ప్రశంసించి తీరాలి. 

కేరళకు వచ్చిన కష్టాన్ని తమ కష్టంగా భావించి సాయం చేయ తానికి డొనేషన్ల రూపంలో  ముందుకు వచ్చారు. వారి వారి సహాయాన్ని రుపాయల్లో ప్రకటించారు. కేరళ లోని 14 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారో వరద ముప్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసు కోవచ్చు.  ఈ స్థాయి పెను విలయం జల విలయం ముంచు కొచ్చింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 

చివరికి ఈ పెను విలయంలో ఖరీదైన ప్రాంతాల్లో నివసించే ఉండే హీరోల ఇళ్లు వరద ముంపుకు గురై జల దిగ్బందనం అయ్యాయి. ఈ విలయాన్ని చూస్తున్న ఇరుగు పొరుగు రాష్ట్రాలు దేశాలే కాదు వ్యక్తిగతంగా నటీనటులు అ నష్టాల బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. 

కోలీవుడ్ హీరో విశాల్ నిత్యావసరాల్ని పంపించి సాయం అందిస్తే – 
తెలుగు కథానాయకుడు ప్రభాస్ కోటి రూపాయిలు 

సూర్య,  కార్తీ, కమల్ హాసన్, - అల్లు అర్జున్, - మమ్ముట్టి- మోహన్ లాల్ ఒక్కొక్కరు ₹25లక్షలు  
విజయ్ సేతుపతి-15లక్షలు – 

ధనుష్, సిద్ధార్థ్ -10లక్షలు 
విజయ్  దేవరకొండ - 5లక్షలు 

సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేషన్ ఇచ్చారు. నిర్మాత బన్ని వాసు గీత గోవిందం కేరళ వసూళ్లు సీఎం రిలీఫ్ ఫండ్ కే డొనేట్ చేసేస్తున్నారు. మరియు చిరంజీవి - రామ్ చరణ్ చెరొక  25 లక్షలు ఇస్తే చిరంజీవి తల్లి గారు అంజనా దేవి ఒక లక్ష మరియు 10 లక్షల విలువైన వైద్యం మందులు సమకూర్చారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రూ.2 కోట్లు,  కొణిదల చిరంజీవి రూ.25 లక్షలు, చిరంజీవి తల్లి రూ.లక్ష, రామ్ చరణ్ తేజ్ రూ. 25 లక్షలు, 10 లక్షల రైస్ అండ్ వాటర్ పాకెట్స్, చరణ్ భార్య ఉపాసన రూ. 10 లక్షలు నాగేంద్రబాబు రూ.15 లక్షలు విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించారు.


నాగార్జున రూ.28 లక్షలు, ప్రభాస్‌ రూ.25 లక్షలు, ఎన్టీఆర్‌ రూ.25 లక్షలు, కల్యాణ్‌ రామ్‌ రూ.10 లక్షలు, విక్రమ్‌ రూ.35 లక్షలు, మహేశ్‌బాబు రూ.25 లక్షలు విరాళాలు అందించారు. ఈ విషయాన్ని నాగార్జున ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘కేరళ బాధితుల కోసం నేను, అమల మా వంతు సాయం చేశాం. మీరూ తోచిన సాయం చేయండి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

మహేశ్‌ ట్వీట్‌ చేస్తూ..‘కేరళ వరద బాధితులకు సాయం చేస్తున్నవారందరికీ ధన్యవాదాలు. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, ఇతర సహాయక బృందానికి సెల్యూట్‌’ అని పేర్కొన్నారు.

వీళ్లతో పాటు బాలీవుడ్ స్టార్లు తమవంతుగా స్పందించి సాయమందించారు. రానా - జాన్ అబ్రహాం - సౌందర్య రజనీకాంత్ వంటి సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానుల్ని సాయం కోరారు. సిద్ధార్థ్, దుల్కార్ సల్మాన్, నయనతార, సాయిపల్లవి, నివిన్ పాళి వంటిస్టార్లు ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా పిలుపునిచ్చారు. వీలై నంత మంది సెలబ్రిటీలు కేరళకు విరాళాల రూపంలోనో లేక ఏదో ఒక సాయం చేసేందుకు ముందుకు రావడం హర్షణీయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: