ఓటమిని అంగీకరించని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌! వీడు కూడ ఇంతే!!

ఓటమిని అంగీకరించటమనేది గొప్ప ఔన్నత్యానికి చిహ్నం. తమిళనాడు సంగతి ఏమో గాని తెలుగులో ఈ సినిమాను కొన్న వాళ్ళకు పీడకలలే మిగిలాయి. విడుదల అయిన మూడో రోజే సినిమా హాళ్ళు ఖాళీగా కనపడ్డాయి. సినిమాలో సరుకు లేకుంటే సూపర్ స్టార్ అయినా పవర్ స్టార్ అయినా ఆ సినిమా శంకరగిరిమాన్యాలు పట్టాల్సిందే స్టార్ పవర్ నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదని మరో సారి ఋజువు చేసారు ప్రేక్షకులు. 

అలాగే జయాపజయాలు దైవాదీనాలు. విజయం లభిస్తే నా అంతవాడు లేడంటారు. అదే అపజయం వస్తే నెపం వేరే వారిపై నెట్టెయ్యటానికి ప్రయత్నిస్తారు. ఒక్కోసారి సూపర్‌ స్టార్ అయినా అపజయాలని అంగీకరించలేరని రజనీకాంత్‌ ని చూస్తే అర్థమవుతోంది. ఈ మద్య విడుదలైన “కాలా” చిత్రం ఎంతటి ఘోరమైన వైఫల్యాన్ని చవి చూసిందో అందరికీ  తెలిసిందే. 

జనం దృష్టిలో ప్రచార ఆర్భాటం తప్ప సరుకులేని చిత్రం కబాలి కైనా వసూళ్ళ వర్షం కురిసింది. కలక్షన్లు వచ్చేసాయి కనుక హిట్‌ అని గుర్తించారనుకోవచ్చు. కనీసం కబాలిలో సగం కూడా వసూలు చేయలేకపోయిన “కాలా” సినిమా విజయవంతమైందని అయిందని చెపుతూ సూపర్-స్టార్ రజనీకాంత్‌ చిరునవ్వులు చిందిస్తున్నారు. పూర్తి ఆత్మవంచన చేసేసుకుంటున్నారు. 


కబాలి చిత్రాన్ని నిర్మించిన దర్శకుడు పా. రంజిత్‌ కి రజనీకాంత్‌ మళ్లీ అవకాశం ఇచ్చినపుడే చాలా మంది ఆశ్చర్యపోయారు. తన నిర్ణయం సరైనదే అని “ఈగో” తో ఈ చిత్రం హిట్‌ అంటున్నారో? లేక మామ బాధ పడకూడదని అల్లుడు ధనుష్‌ ఆయనకి తప్పుడు సమాచారం అందించాడో? కానీ రజనీకాంత్‌ మాత్రం ధారుణ డిజాస్టర్‌ ను “హిట్‌” అని సిగ్గులేకుండా చెప్పుకుంటూ నవ్వుల పాలవుతున్నారు. కృష్ణార్జున యుద్ధం సినిమా విజయవంతమైనదని మీడియా చెప్పినప్పుడు ఒక మిడ్-రేంజ్ హేరో నాని ఖండిస్తూ అది తన జీవితంలో డిజాష్టర్ అని ప్రకటించి ధీరోధాత్తతను సాధించారు. అయితే అంత అత్యున్నత స్థాయి సూపర్-స్టార్ ఇంతగా దిగజారాదంటే రాజకీయాలలోకి ప్రవేసించక ముందే ఆ అవలక్షణాలు అబ్బేశాయంటున్నారు సినీ విశ్లేషకులు. 

తమిళనాడు సంగతి ఏమోగాని తెలుగులో ఈ సినిమాను కొన్నవాళ్ళకు పీడకలలే మిగిలాయి. విడుదల అయిన రోజే సినిమా హాళ్ళు ఖాళీగా కనపడ్డాయి. సినిమాలో సరుకు లేకుంటే స్టార్ పవర్ నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదని మరో సారి ఋజువు చేసారు ప్రేక్షకులు. 


యువ దర్శకులు తనని హ్యాండిల్‌ చేయలేకపోతున్నారని తెలిసినా కానీ రజనీకాంత్‌ మరోసారి కార్తీక్‌ సుబ్బరాజ్‌ అనే యువదర్శకుడికి అవకాశమిచ్చారు. ఇంతవరకు ప్రయోగాత్మక చిన్న చిత్రాలు తీసిన కార్తీక్‌ తన గత చిత్రం “మెర్క్యురీ” తో నిరాశపరిచాడు. ఏదో వివాదాలతో ప్రజల్లో పేరుతెచ్చుకుంది ఆ సత్తాలేని చిత్రం. ఇక రజనీ కాంత్‌ తో అతను ఎలాంటి? చిత్రం తీస్తాడనేది ఎవరికీ తెలియకపోయినా ఈ కాంబినేషన్‌ పట్ల జనానికి కాస్తైనా ఎక్సయిట్‌మెంట్‌ కలగడంలేదు. తగ్గుతోన్న రజనీకాంత్ వైభవాన్ని తిరిగి నిలబెట్టే చిత్రమవుతుందని ఆశిస్తోన్న '2.0' ఏమో? వాయిదాల మీద వాయిదా పడుతూనే వుంది. ఆ శకరుడే రజనీకాంత్ ను గౌరవంగా నిలబెట్టాలి. సరైన కథ ఉంటే రజనీకాంతైనా ఏవరైనా ఒక ఊపు ఊపేస్తారు. అందులో సరుకు లేక పోతే ఆయన అభిమానులైనా ఎడం కాలుతో తన్నేస్తారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: