ఛానల్ యాంకర్‌ ను టార్గెట్ చేసిన మంచు మనోజ్ సాయిధరమ్ తేజ్ లు !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ తనను కొన్ని మీడియా సంస్థలు అదేపనిగా టార్గెట్ చేస్తూ కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి అంటూ కొన్ని ప్రముఖ మీడియా సంస్థల పై యుద్ధం ప్రకటించిన తరువాత ఆప్రముఖ మీడియా సంస్థలు కూడ పవన్ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకుని పవన్ పై ఎదరు దాడి మొదలు పెట్టిన విషయం తెలిసిందే. దీనితో  ప్రస్థుతం పవన్ కళ్యాణ్ తనపై కొన్ని మీడియా సంస్థలు కుట్ర చేస్తున్నాయి అంటూ ఆ మీడియా సంస్థలకు సంబంధించిన కొన్ని సంచలన విషయాలు బయటపెట్టే కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు. 

కొద్దిరోజుల క్రితం ఒక ప్రముఖ ఛానల్ కు చెందిన న్యూస్ హెడ్ తెలుగు చిత్ర పరిశ్రమని దూషించిన వ్యవహారం చల్లారక ముందే అదే ఛానల్ కు చెందిన మరో యాంకర్ టాలీవుడ్ హీరోల గురించి సంచలనమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో ఉన్న హీరోలంతా సొంత డబ్బా కొట్టుకునే వారని ఆయాంకర్ కామెంట్స్ చేసారు. సినిమాల్లో మాత్రమే ఫైట్స్ చేస్తారని రియల్ లైఫ్ లో గుద్దితే పడిపోయే విధంగా ఉంటారని అంటూ ఆయాంకర్ తన విమర్శల దాడి పెంచాడు.    

ఈ కామెంట్స్టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో పెను ప్రకంపనలుసృష్టిస్తున్నాయి. దీనితో రంగంలోకి దిగిన మంచు మనోజ్ ఆ ఛానెల్ పై తన మాటల దాడిని మరింత పెంచి ఆ న్యూస్ ఛానెల్ ప్రసారం చేస్తున్నది బిజినెస్ బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమమా లేక కామెడీ బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమమా అంటూ రివర్స్ పంచ్ వేసాడు. అంతేకాదు గుద్దితే పడిపోయేది నువ్వే అంటూ ఆ న్యూస్ యాంకర్ కు మంచు మనోజ్ ఘాటైన కౌంటర్ ఇచ్చాడు. 

మనోజ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచనలంగా మారడంతో మనోజ్ కామెంట్స్ కు సప్పోర్ట్ ఇస్తూ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా రంగంలోకి దిగి తనదైన రీతిలో స్పందిస్తూ ఆ న్యూస్ ఛానెల్ యాంకర్ ను టార్గెట్ చేసాడు. ఇదే సందర్భంలో ఆన్యూస్ ఛానల్ న్యూస్ రీడర్ టాలీవుడ్ హీరోలు అందరికీ మానసిక వైద్యుడి దగ్గర కౌన్సిలింగ్ ఇప్పిస్తే బాగుంటుంది అంటూ చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి. దీనితో ప్రముఖ ఛానెల్స్ పై పవన్ చేస్తున్న పోరాటం ఇప్పట్లో చల్లారే ఆస్కారం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 

Manoj Kumar Manchu ✔ @HeroManoj1 Is this Business Breakfast or Comedy Breakfast??Nice & funny, well industry

inka
announce
cheyaledhu
ga,
appude
antha
avesham
odhuOkkati Gudhutadu anta seriously? Nuvve
gudhi
nuvve
padipothavCool
babai..
End of the day we all r
brothersLove
u! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: