సినిమా ఇండస్ట్రీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు : ప్రకాశ్ రాజ్

Edari Rama Krishna
ఈ మద్య టాలీవుడ్ ని షేక్ చేస్తున్న డ్రగ్స్ భాగోతంపై ఇప్పుడు ఒక్కో సెలబ్రెటీ నోరు విప్పుతున్నారు.   ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం టాలీవుడ్లో నడుస్తున్న డ్రగ్స్ వివాదంపై స్పందించారు.  ఇప్పటికే  డైరెక్టర్ పూరిజగన్నాథ్, కెమెరామాన్ శ్యామ్ కె.నాయుడు సిట్ ముందు హాజరైన విషయం తెలిసిందే.  ఈ రోజు సిట్ ముందు నటుడు సుబ్బరాజు కూడా హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..సిట్ ఎంక్వైరీకి హాజరయ్యానని, వాళ్ళడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పానని, కెల్విన్ ముఠాతో తనకెలాంటి సంబంధంలేదని అన్న ఆయన మీడియా మాత్రం అసలు నిజం తెలుసుకోకుండా రకరకాల ప్రోగ్రామ్లు చేసి తనను చాలా డిస్టర్బ్ చేశారని, ఇది కరెక్ట్ కాదని అన్నారు.

అంతే కాదు గత వారం రోజుల నుంచి మీడియా సినిమా ఇండస్ట్రీపైనే ఫోకస్ పెట్టిందని డ్రగ్స్ దందా కేవలం సినిమా వరకే పరిమితం కాలేదని విద్యావవస్థ, ఐటీ రంగంలో కూడా విస్తరించిందని దాని విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని కేవలం సినిమా ఇండస్ట్రీ వారినే టార్గెట్ చేయడం ఎంత వరకు న్యాయం అని  అన్నారు.  

అంతే కాదు  ప్రకాష్ రాజ్.. పూరి మాటల్ని సపోర్ట్ చేస్తూ ఒక విషయంలో పూర్తి నిజం బయటకురాకముందే ప్రజలుగాని, మీడియాగాని ఆ అంశాన్ని హడావుడి చేసి సంచలనం చేయడం కరెక్ట్ కాదని, ఇది అందరూ తెలుసుకోవాలని హితవు పలికారు.
 


It is high time we the people and the media realise it's not fair to sensationalise issues before the complet truth comes out. 🙏🙏🙏 https://t.co/ITQYOzz9ft

— Prakash Raj (@prakashraaj) July 20, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: