అలాంటి దాడులు దారుణం... షర్మిల..!

Pulgam Srinivas
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని స్థాపించిన విషయం మనకు తెలిసిందే. ఈ పార్టీ స్థాపన విషయంలోనూ , ఆ తర్వాత ఈ పార్టీ ముందుకు సాగే విషయంలోనూ ఈమె కీలక పాత్రను పోషించింది. ఒకానొక సమయంలో జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీ బాధ్యతలను, కుటుంబ వ్యవహారాలను ఈమె దగ్గరుండి చూసుకుంది.

ఇక ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీరి కుటుంబంలో మనస్పర్ధలు రావడంతో ఈమె ఆంధ్ర రాజకీయాల్లో ఉండకుండా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఓ పార్టీని కూడా స్థాపించి కొంత కాలం పాటు ప్రచారాలను కూడా చేసింది. ఇక చివరగా 2023 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా వేళా ఈమె ఆ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఇక ఆ తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఎంపిక అయింది.

ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుండి అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలలో అభ్యర్థులను నిలిపిన కూడా ఎక్కడా కూడా ఈ పార్టీ అభ్యర్థులు గెలవలేదు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో తాజాగా జరిగిన ఎన్నికలలో కూటమి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న దాడులపై తాజాగా షర్మిల స్పందించింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు అత్యంత దారుణం. ఇది పిరికిపందల చర్య. తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వైయస్సార్ పేరు చరపలేని ఒక జ్ఞాపకం. ఇలాంటి నేతకు నీచ రాజకీయాలు, గెలుపు , ఓటములు ఆపాదించడం తగదు. వైఎస్సార్ ను అవమానించే చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని ఆమె డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: