ప‌వ‌న్ కోసం సీటు త్యాగం చేసిన వ‌ర్మ‌కు అప్పుడే పెద్ద షాక్‌... ప‌ద‌వి హుష్‌కాకే..!

RAMAKRISHNA S.S.
తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూట‌మి విజ‌యం అంబ‌ర‌మంటిన విష‌యం తెలిసిందే. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో విజ‌యం ద‌క్కించుకుంది. 175 స్థానాల్లో 164 స్థానాల‌ను కూట‌మి కైవ‌సం చేసుకుంది. అయితే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో టికెట్ల కేటాయింపు విష‌యంలో కూట‌మి పార్టీల నాయ‌కులు చాలా మంది టికెట్ల‌ను త్యాగం చేశారు. ముఖ్యంగా ఈ ప‌రిస్థితి.. టీడీపీ, జ‌న‌సేన‌ల్లో ఎక్కువ‌గా క‌నిపించింది. దీంతో ఇలా టికెట్లు త్యాగం చేసిన వారికి ఇప్పుడు ప్రాధాన్యం ద‌క్కుతుంద‌ని అంటున్నారు.

ప్ర‌ధానంగా జ‌న‌సేన కోసం టికెట్ త్యాగం చేసిన ఎస్‌వీఎస్ ఎన్‌వ‌ర్మ పేరు మంత్రి వ‌ర్గ జాబితాలో ముందు న్నట్టు తెలుస్తోంది. ఈయ‌న‌కు ఖ‌చ్చితంగా మంత్రి వ‌ర్గం జాబితాలో చోటు ద‌క్కే అవ‌కాశం ఉంది. ఎందు కంటే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం వ‌ర్మ త‌న పిఠాపురం టికెట్ ను త్యాగం చేశారు. అంతేకాదు.. ప‌వ‌న్ విజ‌యాన్ని భుజాన‌వేసుకుని ముందుకు క‌దిలారు. ప‌వ‌న్ క‌న్నా ఎక్కువ‌గానే టెన్ష‌న్ ప‌డ్డారు. మొత్తానికి 70 వేల ఓట్ల మెజారిటీతో ప‌వ‌న్ విజ‌యం ద‌క్కించుకునేలా కృషి చేశారు.

తొలుత త‌న స్థానాన్ని వ‌దులుకునేందుకు వ‌ర్మ నిరాక‌రించారు. దీంతో ఆయ‌న‌ను ఊర‌డించిన చంద్ర‌బా బు పార్టీ అదికారంలోకి వ‌చ్చాక‌.. క్ష‌త్రియ సామాజిక‌వర్గం కోటాలో మంత్రి పీఠం ఖాయ‌మ‌ని చెప్పారు. అయితే..ఇప్ప‌టికిప్పుడు ఇదిసాధ్య‌మయ్యేలా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే వ‌ర్మ తాజా ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించ‌కోలేదు. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాలంటే..ఖ‌చ్చితంగా మండ‌లికి పంపించాలి. కానీ, అక్క‌డ 2026- 2027 వ‌రకు  సీట్లు ఖాళీగా లేవు.

దీంతో వ‌ర్మ అప్ప‌టి వ‌ర‌కు ఎదురు చూడ‌క త‌ప్ప‌దు..పోనీ.. తాజాగా ఖాళీ అయిన‌.. విజ‌య‌న‌గ‌రం జిల్లా స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ప‌ద‌వికి ఆయ‌న‌ను ఎంపిక చేయాలన్నా.. దీనికి కూడా..మ‌రో ఆరు మాసాల వ‌ర‌కు స‌మ‌యం పడుతుంది. పైగా.. ఇది వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన ర‌ఘురాజు స్థానం. దీంతో ఇక్క‌డ ఆయ‌న ఒప్పుకొంటారా? అనేది ప్ర‌శ్న‌. ఎలా చూసుకున్నా.. వ‌ర్మ వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు. మ‌రి అప్ప టి వ‌ర‌కుఆయ‌న‌కు ఏదైనా నామినేటెడ్ ప‌ద‌విని ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: