వామ్మో..ముగ్గురిని పెళ్లిచేసుకున్న నటీ..మరి ఇప్పుడు..!

Edari Rama Krishna
సాధారణంగా సినిమా రంగానికి చెందిన నటీ నటులు ఎక్కువ శాతం ప్రేమ వివాహాలు చేసుకుంటారు.  అందులో సక్సెస్ అయి జీవిత కాలం కలిసి కాపురం చేస్తున్న వారు మాత్రం చాలా తక్కువ అనే చెప్పాలి.  మరికొంత మంది విడాకులు ఇచ్చుకొని తమకు నచ్చిన వారిని ద్వితీయ వివాహం చేసుకున్న జంటలు కూడా చాలా ఉన్నాయి.  సినిమా ఇండస్ట్రీ సీనియర్ నటుడు విజయ్ కుమార్-మంజుల కూతురు వనిత ఆ మద్య కొన్ని సినిమాల్లో నటించింది.   కానీ సినిమాల్లో సక్సెస్ మాత్రం పెద్దగా సాధించలేక పోయింది.

ఈమె సోదరి శ్రీదేవి కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది..అంతే కాదు ఆమె సోదరుడు అరుణ్ విజయ్ కూడా నటుడిగా మంచి గుర్తిపు తెచ్చుకున్నాడు.  రాంచరణ్ నటించిన బ్రూస్ లీ చిత్రంలో అరుణ్ విజయ్ విలన్.  ఇక అసలు విషయానికి వస్తే.. వనిత ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకొని అందరినీ ఆశ్చర్య పరిచింది.   మూడు సార్లు పెళ్లిళ్లు చేసుకున్న ఈ భామ ఆ ముగ్గురు భర్తలను కూడా వదిలివేయడం మరో షాకింగ్ న్యూస్.   మొత్తానికి పదేళ్లలో ముగ్గురు భర్తలను వదిలేసి ఇప్పుడు చెన్నై సమీపంలో ఉంటోంది.  

మొదట టివి నటుడు ఆకాష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది..తర్వాత ఆనంద్ రాజ్ ని పెళ్లి చేసుకుంది అతడితో కాపురం చేసి ఒక అమ్మాయికి జన్మ నిచ్చింది.  కొంత కాలం తర్వాత వీరి మద్య అభిప్రాయభేదాలు వచ్చి విడిపోయారు. ముచ్చటగా మూడో సారి ఐటమ్ గర్ల్  అల్ఫాన్స్ సోదరుడు రాబర్ట్ ని మూడో పెళ్లి చేసుకుంది.  ప్రస్తుతం కోలీవుడ్ లో వీరిద్దరూ ఇప్పుడు బ్రేకప్ చెప్పుకున్నట్లు అనుకుంటున్నారు.  ఇలా మూడు పెళ్లిళ్లు చాలదన్నట్లు ఇప్పుడు కూతురు విషయంలో రెండో భర్త తో గొడవలు అవుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: