టీవీ: బాలయ్య పై.. నటుడు సంచలన వ్యాఖ్యలు..!

Divya
నందమూరి హీరో బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలలో రాజకీయాలలో చాలా బిజీగా ఉంటున్నారు.. ఎప్పుడూ కూడా అభిమానులను తన పంచ్ డైలాగులతో మెప్పిస్తూనే ఉంటారు బాలయ్య. బాలకృష్ణని ఎంతోమంది కోపిష్టి, సెల్ఫీస్టి అని కూడా చెబుతూ ఉంటారు.. మరి కొంతమంది మంచి వ్యక్తి అంటూ సరదాగా ఉంటారంటు కూడా కితాభిస్తూ ఉంటారు.. అయితే బాలకృష్ణ సెట్లో ఉండేటప్పుడు ఆయన నిజ స్వరూపం ఏంటో ఇప్పుడు నటుడు సమీర్ బయట పెట్టడం జరిగింది. బాలకృష్ణ సినిమాలలో ఎక్కువగా సమీర్ కనిపిస్తూ ఉంటారు.

అందుకే బాలకృష్ణకు సమీర్ కు మంచి బంధం ఉన్నది. ముఖ్యంగా బాలకృష్ణకి కోపం వస్తే కొడతారని అది సినిమా సెట్ అయిన పబ్లిక్ మీటింగ్ అయినా కూడా చిరాకు తెప్పిస్తే ఫైర్ అవుతారనే ఇప్పటికే చాలామంది తెలియజేశారు. ఒకరోజు సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య రిలాక్స్ అవుతూ ఉంటే సినిమా షూటింగ్ కాస్త గ్యాప్ వచ్చిందని ఆ సమయంలో బాలయ్య చిలిపీ తనం మొదలయ్యిందనీ..దీంతో నటుడు సమీర్ భార్య ఫోన్ నెంబర్ అడిగారట.. ఒక్కసారిగా సమీర్ టెన్షన్ పడ్డారని తెలిపారు.

ఎందుకో చెప్పండి సార్ ఫోన్ కలిపి ఇస్తానని చెప్పాడట సమీర్.. అయినా కూడా వినకుండా బాలయ్య మీ వైఫ్ నెంబర్ ఇవ్వకూడదా నేను మాట్లాడకూడదా అంటూ బాలయ్య చెప్పారట.. ఆ సమయంలో నటుడు సమీర్ కు ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతూనే ఇచ్చానని.. తన ముందే తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడిన మాటలకు ఒక్కసారిగా షాక్ అయ్యానని తెలిపారు సమీర్.. మీ భర్త సమీర్ సినిమా షూటింగ్ స్పాట్ కి రాలేదు.. ఆయన కోసం టీమంతా వెయిట్ చేస్తున్నాము.. మొబైల్ కూడా లిఫ్ట్ చేయలేదు.. మీకు ఏమైనా తెలుసా మీ నెంబర్ కనుక్కొని ఫోన్ చేస్తున్నాను అంటూ బాలయ్య మాట్లాడారట.. అయితే సమీర్ భార్య నమ్మకపోవడంతో చివరికి తాను బాలకృష్ణ అని చెప్పాడట.. అలా వెంటనే ఫోన్ కట్ చేయగా.. వరుసగా తన భార్య సమీర్ కి ఫోన్ చేస్తోందట. తన మొబైల్ ని కూడా బాలయ్య వద్ద పెట్టుకొని ఫోన్ ని కట్ చేస్తున్నాడు.. ఆ తర్వాత మెసేజ్లను కూడా ఆమె పెట్టడంతో వాటిని అందరి ముందు చదివి ఇరికించాడు అంటే చెప్పుకొచ్చారు సమీర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: