ఈరోజు ఐపీఎల్ లో అసలు సిసలు పోరు... ప్లే ఆప్స్ కి వెళ్ళేది ఎవరు..?

Pulgam Srinivas
(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ , బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు కూడా అత్యంత కీలకమైన మ్యాచ్. ఇప్పటికే ఈ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ , సన్రైజర్స్ హైదరాబాద్ ఈ మూడు జట్లు కూడా పాయింట్ల పట్టికలో మొదటి మూడు స్థానాలలో ఉండి ప్లే ఆప్స్ కి చేరిపోయాయి. ఇక ప్లే ఆప్స్ కి వెళ్లడానికి ఒకే ఒక్క స్థానం మాత్రమే మిగిలి ఉంది.

ఆ ఒక్క స్థానం కోసమే ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ మరియు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో వారే ప్లే ఆప్స్ కి వెళ్లే అవకాశం చాలా వరకు ఉంది. కాకపోతే చెన్నై సూపర్ కింగ్స్ రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉండటంతో వారు కనుక ఈ మ్యాచ్ గెలిచినట్లయితే ప్లే ఆప్స్ కి వెళ్ళిపోతారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ కి ఉన్నంత అనుకూలత ప్లే ఆప్స్ కి వెళ్లడానికి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు కి లేదు.

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ , చెన్నై సూపర్ కింగ్స్ పై గెలవడం మాత్రమే కాకుండా మంచి రన్ రెట్ ను కూడా ఈ మ్యాచ్ ద్వారా పెంచుకోవాల్సి ఉంది. అలా ఈ మ్యాచ్ ను మంచి రన్ రేట్ తో గెలిస్తేనే బెంగుళూరు ఈ సీజన్ లో ప్లే ఆప్స్ కి వెళుతుంది. ఇక ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వారే ప్లే ఆప్స్ కి వెళ్లడానికి అవకాశం ఉండడంతో ఈ మ్యాచ్ చూడడానికి చెన్నై సూపర్ కింగ్స్ , బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్ల అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ఐపిఎల్ అభిమానులు కూడా ఈ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? ఎప్పుడు చూద్దామా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఈ రోజు మ్యాచ్ కి వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరి ఈ రోజు మ్యాచ్ కి వర్షం ఏమైనా అంతరాయం కలిగిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: