హార్దిక్ కి భారీ వేటు... ఆ కారణంతో 2025 ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ కి దూరం..!

Pulgam Srinivas
టీమిండియాలో అద్భుతమైన క్రేజ్ కలిగిన ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా ఒకరు. ఈయన తన బ్యాట్ తో భారీ సిక్స్ లను బాధడం మాత్రమే కాకుండా , బౌల్ తో ప్రత్యర్ధులకు చమటలు పట్టిస్తూ ఉంటాడు. ఇలా తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న ఈయన ఐ పీ ఎల్ మ్యాచ్ లలో ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. ఈయన ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ సీజన్ లో కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈయన కెప్టెన్సీ లో ముంబై ఇండియన్స్ జట్టు చాలా పేలావామైన ఆట తీరును ప్రదర్శించింది.

ఈ సీజన్ లో ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టు 14 మ్యాచ్ లను ఆడింది. ఈ 14 మ్యాచ్ లలో చాలా మ్యాచు లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ముంబై నిలిచింది. ఇకపోతే ఐ పి ఎల్ మ్యాచ్ లలో భాగంగా ఎవరైనా స్లో బౌల్ రేట్ ను కనబరిచినట్లు అయితే బౌలింగ్ వేస్తున్న జట్టు కెప్టెన్ కు భారీ మొత్తంలో జరిమానాలను విధిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ సీజన్ లో ముంబై జట్టు మూడుసార్లు స్లో ఓవర్ రేట్ నియమాన్ని ఉల్లంఘించింది. దానితో ముంబై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా కి ఐ పీ ఎల్ బోర్డ్ పెద్ద మొత్తంలో జరిమానాను , ఒక మ్యాచ్ ను కూడా నిషేధించింది.

మూడు సార్లు స్లో ఓవర్ రేట్ నియమాన్ని ఉల్లంఘించినందుకు హార్దిక్ పాండ్యా కు ఐ పీ ఎల్ బోర్డ్ 30 లక్షల జరిమాణాను విధించింది. అలాగే దీనితో పాటు మరో మ్యాచ్ ఆడకుండా నిషేధించింది. ఇప్పటికే ముంబై జట్టు ఈ సీజన్ లో అన్ని మ్యాచ్ లను కంప్లీట్ చేసుకోవడంతో హార్దిక్ పాండ్యా వచ్చేసి సీజన్ లో ఆడబోయే మొదటి మ్యాచ్ కి దూరం కానున్నాడు. నిన్న రాత్రి ముంబై , లక్నో తో తలపడింది. ఈ మ్యాచ్ లో కూడా ముంబై జట్టు స్లో ఓవర్ రేట్ నియమాన్ని ఉల్లంఘించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Hp

సంబంధిత వార్తలు: