150 కేజీల డెడ్ లిఫ్ట్‌తో సమంత! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'రౌడీ' క్వీన్ వర్కౌట్ వీడియో!

Amruth kumar
టాలీవుడ్ వెండితెరపై తన అందంతో, నటనతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన సమంత రూత్ ప్రభు, ఇప్పుడు ఒక రియల్ లైఫ్ సూపర్ ఉమెన్‌గా కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా 'మయోసైటిస్' అనే ప్రాణాంతక ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతున్న సామ్, తనలోని పట్టుదలను ఏమాత్రం కోల్పోలేదు. తాజాగా ఆమె జిమ్ లో చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే.. "సమంత అంటే కేవలం గ్లామర్ కాదు, అన్‌స్టాపబుల్ పవర్" అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.


జిమ్ లో సమంత పడే కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియోలో ఏకంగా 150 కేజీల డెడ్ లిఫ్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.మయోసైటిస్ కారణంగా కండరాల నొప్పులు, నీరసంతో ఇబ్బంది పడ్డ సమంత.. ఇప్పుడు అదే కండరాలను ఉక్కులా మార్చేసింది. "కొన్నేళ్ల క్రితం నాకు బలమైన వీపు (Back) ఉంటుందని నేను ఊహించలేదు.. అది నా జీన్స్‌లో లేదనుకున్నాను. కానీ నేను తప్పు అని నిరూపించుకున్నాను" అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. గతంలో సామ్ సన్నగా అయిపోయిందని, అనారోగ్యంగా కనిపిస్తోందని ట్రోల్ చేసిన వారికి ఈ 150 కేజీల బరువు ఎత్తడం ద్వారా గట్టి సమాధానం ఇచ్చింది.



2022లో తనకు మయోసైటిస్ ఉందని తెలిసినప్పటి నుండి సమంత జీవితం పూర్తిగా మారిపోయింది.దాదాపు ఏడాది కాలం పాటు ఒకే రకమైన కూరగాయలు, చికెన్ తింటూ అత్యంత కఠినమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ పాటించింది.ఫిజికల్ వర్కౌట్స్ తో పాటు మెడిటేషన్, జర్నలింగ్ ద్వారా తన మానసిక స్థితిని కూడా స్ట్రాంగ్‌గా మార్చుకుంది. "జీన్స్‌లో లేదు అనేది కేవలం ఒక సాకు మాత్రమే" అని నిరూపిస్తూ, అనారోగ్యంతో బాధపడే వేలాది మందికి ఆమె ఒక ధైర్యాన్ని ఇస్తోంది.



ఒకవైపు ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెడుతూనే, మరోవైపు తన కెరీర్‌ను కూడా ట్రాక్ లోకి తెస్తోంది.సిటాడెల్:హనీ బన్నీ: వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన ఈ స్పై యాక్షన్ సిరీస్ కోసం సమంత చేసిన యాక్షన్ సీక్వెన్స్ మామూలుగా ఉండవని టాక్.త్వరలోనే నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్టును కూడా సామ్ పట్టాలెక్కించబోతోంది.సమంత అంటే కేవలం ఒక హీరోయిన్ కాదు.. ఓడిపోని ఒక పోరాట యోధురాలు. 150 కేజీల బరువు ఎత్తడం అంటే అది కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, ఆమె సంకల్ప బలం.


https://www.instagram.com/p/DVTS3K0mpCp/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: