ఫ్యాన్స్ వెయిటింగ్‌కు ఎండ్.. యష్–కియారా ‘టాక్సిక్’ రొమాంటిక్ సాంగ్ రిలీజ్!
రీసెంట్ గా ఒక హాట్ పోస్టర్ తో లీడ్ జంట యష్, కియారా అద్వానీ ల పోస్టర్ తో సోషల్ మీడియాలో క్రేజీ రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ రొమాంటిక్ నెంబర్ పై మరో అప్డేట్ అందించారు. దీనితో ఈ సాంగ్ ని మార్చ్ 2న మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు హీరో హీరోయిన్స్ పై మరో బ్యూటిఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు. సో ఫ్యాన్స్ అప్పుడు వరకు ఆగాల్సిందే. అలాగే ఈ సాంగ్ ని రవి బసృర్ ఎలా కంపోజ్ చేసారో కూడా చూడాలి. ఇక ఈ సినిమాకి కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ మార్చ్ 19న సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతుంది.
'టాక్సిక్' సినిమాలో మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రలో నటిస్తోంది.ఈ సినిమాలో యష్‌కు అక్కగా నయనతార కనిపించబోతోంది. మాస్ యాక్షన్ సినిమాలో ఈ ఎమోషనల్ యాంగిల్ సినిమాకు పెద్ద అసెట్ కానుంది.బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి ఇందులో పవర్‌ఫుల్ విలన్ రోల్ చేస్తోందని టాక్. అంటే హీరో వర్సెస్ విలన్ పోరు మామూలుగా ఉండదు.దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ విజువల్ వండర్‌ను నిర్మిస్తోంది.సినిమాలోని పాటలు, ముఖ్యంగా ఇప్పుడు షూట్ చేయబోయే రొమాంటిక్ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకోవడం ఖాయం.కేజీఎఫ్ తర్వాత యష్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కియారాతో రొమాన్స్, నయనతారతో ఎమోషన్, హ్యుమా ఖురేషీతో యుద్ధం.. ఇలా అన్ని ఎలిమెంట్స్ 'టాక్సిక్'లో పుష్కలంగా ఉన్నాయి.